Health Benefits: పాలు, అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తప్పనిసరిగా డైలీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే. డైలీ వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా జిమ్‌కి వెళ్లే వాళ్లు తప్పకుండా అరటి పండ్లను తింటారు. పాలు కూడా ఆరోగ్యానికి మంచివని ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే అరటిలో కూడా పొటాషియం, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది. నీరసం, అలసట అన్ని కూడా అరటి పండ్లు తినడం వల్ల పోతాయి. డైలీ అరటి పండ్లను తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే పాలు, అరటి కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావిస్తారు. రెండింట్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేర్వేరుగా కాకుండా కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నారు. కానీ రెండు కలిపి తీసుకోవడం అనారోగ్య బారిన పడతారని నిపుణులు అంటున్నారు. మరి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలినే నష్టాలు ఏంటో చూద్దాం.
ఆరోగ్యానికి పాలు, అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది జిమ్‌కి వెళ్లేవారు.. పాలలో అరటి పండ్లు వేసుకుని, ఓట్స్ కలిపి తింటారు. లేదా బనానా మిల్క్ షేక్ చేసి తాగుతుంటారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రెండు కలిసిన తర్వాత ఇందులోని పోషకాలు శరీరంలోకి వెళ్లాక వ్యతిరేక స్వభావంగా ఉంటాయని ఇవి ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. ఇలా రెండు కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తాగడం వల్ల బరువు కూడా పెరుగుతారు. ఊబకాయం ఉన్నవారు అసలు ఈ రెండు కలిపి తాగడకూడదు.
ముఖ్యంగా సైనసైటిస్‌తో బాధపడేవారు అసలు ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే శరీరంలో టాక్సిన్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు అంటున్నారు. కొందరు ఇందులో కోడి గుడ్లు కూడా మిక్స్ చేస్తారు. కేక్ లేదా ఫిట్‌నెస్ పాటించేవారు ఇలా డైలీ తింటుంటారు. పాలు, అరటి కలిపి తీసుకుంటే కొందరికి అలెర్జీ, జలుబు, దగ్గు కూడా వస్తాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కేలరీలు పెరుగుతాయి. దీంతో తొందరగా బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు బరువు పెరగాలంటే మాత్రం తప్పకుండా వీటిని కలిపి తీసుకోవచ్చు. అది కూడా వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. వీటిని కలిపి కంటే వేరు వేరుగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.