Corona Vaccine: కరోనా మహమ్మారి మానవాళిని ఎంతో ఆందోళనకు గురి చేసింది. మనుషులను ముప్పతిప్పలు పెట్టింది. కోవిడ్ 19 తీరుతో ఎన్నో సమస్యలు సృష్టించింది. కరోనా టీకా తయారు చేయడంతో మనుషుల ప్రాణాలకు ముప్పు తప్పింది. ప్రస్తుతం కరోనా భయం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మరో కొత్త భయం ఆందోళన కలిగిస్తోంది. కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో రుజువు కావడంతో టీకా తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. దీంతో కరోనా టీకా వేయించుకున్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండటంతో వారిలో ఆందోళన వెంటాడుతోంది.

అమెరికాలో సైతం చాలా మందికి టీకా తీసుకున్న వారికి గుండె జబ్బులు వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే వీలుంటుందని తేలడంతో ఇక టీకా తీసుకున్న వారు నిత్యం భయాందోళనల మధ్య బతుకు వెళ్లదీస్తన్నారు. టీకా తమ ప్రాణాలకు ముప్పు తెస్తుందోమోనని బెంగ పడుతున్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాదీకార్డియా సిండ్రోమ్ (పోట్స్) అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏఎన్ఐ ప్రకారం కోవిడ్ 19 నుంచి రక్షించే వ్యాక్సిన్ ను తయారు చేసిన తరువాత పోట్స్ వంటి వ్యాధి వచ్చే ప్రమాదం ప్రజల్లో ఐదు రెట్లు పెరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ కు గురైతే గుండె జబ్బులు కచ్చితంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తున్నారు. పోట్స్ తీవ్రత తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2020-22 మధ్య రెండు లక్షలకు పైగా టీకాలు వేశారు. దాదాపు 12 వేల మంది దాకా గుండె జబ్బులకు గురైనట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి.

పోట్స్ లక్షణాలు పరిశీలిస్తే నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పదినిమిషాల్లో హృదయ స్పందన రేటు 30 బీట్లకు పెరుగుతుంది. 120 బీట్లకు చేరుకుంటుంది. మూర్చ, మైకం, అలసట, తలనొప్పి, అధిక మూత్ర విసర్జన, చేతులకు చెమట పట్టడం, ఆందోళన వంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇక టీకా తీసుకున్న వారిలో గుండె జబ్బుల ముప్పు ఉండటంతో వారికి ఆందోళన పెరుగుతోంది. సరైన సమయంలో స్పందించి చికిత్స తీసుకుని మనసులో ఎలాంటి ఆందోళన ఉంచుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.