Smartphones: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో మన మొబైల్ ఫోన్ ను ఎవరైనా దొంగలించినా లేదా మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నా ఇబ్బందులు పడుతుంటారు. అయితే మొబైల్ ఫోన్ పోయినా సులువుగా కొన్ని టిప్స్ ను పాటించడం ద్వారా ట్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వాళ్లను దృష్టిలో ఉంచుకుని చాలారోజుల క్రితమే కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త సాఫ్ట్ వేర్ సహాయంతో ఫోన్ ఎక్కడుందో సులభంగా తెలుసుకోవడంతో పాటు ఫోన్ ను సులభంగా బ్లాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 14422 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఫోన్ ఆన్ లో ఉంటే ఆ ఫోన్ ఎక్కడ ఉందో కూడా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఆ సమాచారం మొబైల్ కంపెనీకి వెళుతుంది.
ఈ నంబర్ కు కాల్ చేసిన తర్వాత ఐఎమ్‌ఈఐ నెంబర్ ద్వారా కంపెనీ ఫోన్ ను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి పోగొట్టుకున్న వ్యక్తికి చేరవేయడం జరుగుతుంది. కొన్ని యాప్స్ సహాయంతో స్మార్ట్ ఫోన్ ఎక్కడున్నా సులభంగా గుర్తుంచుకోవచ్చు. దేశంలో స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో స్మార్ట్ ఫోన్ల దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ల దొంగతనం జరిగినా ఈ విధంగా చేయడం ద్వారా సులువుగా ఫోన్ ను కనిపెట్టవచ్చు. ఫోన్ పోయిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మంచిది. ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసులు సైతం వేగంగా ఫోన్ ను కనిపెట్టే అవకాశాలు ఉంటాయి.