Husband And Wife Relationship: శృంగారం బంగారం కంటే ఎక్కువ. దీనికి అందరు ఉత్సాహం చూపిస్తారు. దంపతుల మధ్య శృంగారమే అనుబంధా్ని పెంచుతుంది. ప్రేమానురాగాలు పెంపొందడంలో శృంగారమే కీలక భూమిక పోషిస్తుంది. ఇలా శృంగారం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి. మొదటికే మోసం వస్తుంది. జీవిత భాగస్వామిని తొందర పెట్టకుండా నిదానంగా మన దగ్గరకు తీసుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. రహస్యాలు లేకుండా ఇద్దరి మనసులు ఏకాంతంగా ఉంటే ఎన్నో విధాలా లాభాలుంటాయి.

ఆలుమగలు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల శృంగారంపై మక్కువ పెరుగుతుంది. మెదడు కూడా అనుకూలంగా మారుతుంది. శరీరంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటేనే శృంగారం మన వశమవుతుంది. దీంతో మెంటల్ గా కూడా మనకు అన్ని విషయాలు అనుకూలిస్తాయి. శృంగారం చేయడం వల్ల రోగాలు రాకుండా పోతాయి. ఈ విషయాన్ని స్వయంగా వైద్యులే చెబుతున్నారు.
శృంగార సమయంలో కోపం అసలు రాకూడదు. ఒకవేళ మనం కోపాన్ని ప్రదర్శిస్తే జీవిత భాగస్వామి దూరం కావచ్చు. మానసికంగా వారిని మన దగ్గరకు చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలి. శృంగారం చేసే విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వారు ఎడమొహం పెడమొహం పెడితే ఇక మనకు పస్తులే. అందుకే శృంగారం జరిపే ప్రక్రియలో తగు సమయం తీసుకుని మరీ ముందుకు వెళ్లాలి. అంతేకాని అడపాదడపా చేస్తే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది.

శృంగారం చేసే సమయంలో ఆడవారిపై ఒత్తిడి పెంచకూడదు. వారికి మూడ్ వచ్చినప్పుడే మన దగ్గరకు వస్తారు. అలాగని ప్రతి గంటగంటకు శృంగారం కావాలని డిమాండ్ చేస్తే ఊరుకోరు. కనీసం ఓ పది పదిహేను నిమిషాల పాటు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకుని ఆ తరువాత రంగంలోకి దిగితే ప్రయోజనం. ఏదో మూడ్ వచ్చింది పద అంటే కుదరదు. దానికి కూడా ఓ నిర్దిష్ట సమయం కేటాయించుకుంటేనే మంచిది. కాదంటే ఇబ్బందులే ఎదురవుతాయి. ఈ విషయంలో ఇద్దరికి స్పష్టమైన అవగాహన ఉంటే మంచిది.
జీవితభాగస్వామి పై కామెంట్లు చేయొద్దు. వారి ఆత్మాభిమానాన్ని గౌరవించాలి. వారి కోరికలను తీర్చేందుకు మొగ్గు చూపాలి. అప్పుడే మన మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. తద్వారా మనం చెప్పినట్లు వింటారు. వారికి మూడ్ ఉన్నప్పుడే మనం శృంగారం చేసేందుకు ప్రయత్నించాలి. కానీ నాకు కావాలి పద అంటే కుదరదు. వారు వినరు. వినేదాకా ఒర్పుగా ఉంటేనే పని జరుగుతుంది.