Harsha Goyenka : ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరు కూడా విలాసవంతమైన జీవితం కోరుకుంటారు. అయితే విలాసవంతమైన జీవితం అంటే ఒక్కోరి ఆలోచనలో ఒక్కోటి. కొందరికి పెద్ద బంగ్లాలు, మరికొందరికి కార్లు, డబ్బు ఇలా ఒక్కోక్కరికి ఒక్కోటి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే చాలా మంది సుఖానికి అలవాటు పడి వీటినే కోరుకుంటున్నారు. ఖరీదైన కార్లు, డబ్బు, బంగ్లాలు, తిరగడం ఇవే విలాసవంతమైన జీవితం అని భావిస్తున్నారు. కానీ ఇవన్నీ విలాసవంతమైన జీవితం కాదని హర్ష్ గొయోంకా (Harsha Goyenka) తెలిపారు. విలాసవంతమైన జీవితం అంటే కంటి నిండా నిద్ర, ప్రశాంతమైన జీవితం అని అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది నిద్ర సమస్యలతో (Sleep Issues) ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ఎన్ని గంటలు అయినా కూడా నిద్ర పట్టదు. దీంతో మానసిక సమస్యలు అనారోగ్య సమస్యల (Health Issues) బారిన పడుతున్నారు. ఎవరికైతే కళ్లు మూసిన వెంటనే నిద్ర (Sleep) పడుతుందో వారు ఈ ప్రపంచంలో అందరి కంటే అదృష్టవంతులు. అలాగే ప్రశాంతమైన జీవితం ఉన్నవారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు ఉంటుంది. కానీ ప్రశాంతంగా జీవించలేరు. ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఎల్లప్పుడూ కూడా ఆందోళన చెందుతూనే ఉంటారు. ఇలాంటి జీవితం కంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటేనే విలాసవంతమైన జీవితం.
ఇవే కాకుండా మనిషికి అన్నింటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం ఉన్నా వ్యర్థమే. అలాగే గడిచిపోయిన సమయం కూడా తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. ఇది అన్నింటికంటే విలాసవంతమైనది. కొందరు వారం అంతా వర్క్ చేసి సెలవు రోజు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ రెస్ట్ తీసుకోకుండా సమయం వృథా చేస్తారు. ఇలా సమయం వృథా చేశామనే ఫీలింగ్‌తో కాకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే విలాసవంతమైన జీవితం. రోజూ ఉదయం ఏదో టెన్షన్, ఆందోళన, తొందరతో కాకుండా ప్రశాంతంగా నిద్రలేవాలి. హ్యాపీగా డేని ప్రారంభించడం కూడా విలాసవంతమైన జీవితమే. కొందరికి డబ్బు అన్ని ఉంటాయి. కానీ అసలు సరిగ్గా నిద్రపోరు. పడుకోవాలన్నా కూడా రేపు ఏం అవుతుందనే టెన్షన్ ఉంటుంది. ఇలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోయిన వాళ్లు కూడా అదృష్టవంతులే.
ఇతరులతో మాట్లాడే మాటలు కూడా ఉపయోగ పడే విధంగా ఉండాలి. అంతే కానీ పనికి రానివి కాకూడదు. అలాగే ఇంటి భోజనాన్ని తృప్తిగా తినే వారు కూడా అదృష్టవంతులే. వీటి అన్నింటి కంటే ప్రేమ విలాసవంతమైనది. మనం ఒకరికి ప్రేమ చూపించడం, వారు తిరిగి మళ్లి మనకి ప్రేమను పంచడం అనేది అన్నింటికంటే విలాసవంతమైనది. ఎవరైతే ద్వేషం లేని ప్రేమను పొందుతారో వారే ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డబ్బు, కార్లు, బంగ్లాలు, ఖరీదైన వస్తువులు విలాసవంతమైనవని అనుకుంటారు. దీని కోసం ఏ పని చేయడానికి అయినా కూడా వెనుకాడటం లేదు. అసలు విలాసవంతమైనవి ఏంటో సరిగ్గా తెలియక.. సొంత మనుషుల ప్రేమలను పొగోట్టుకుంటున్నారు. మనిషికి మనశ్శాంతి లేకపోతే ఏడు అంతస్తులు మేడ ఇంటిలో తిన్నా తృప్తి ఉండదు. మనస్సు ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా పూరి గుడిసెలో కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి పనికి రాని విలాసవంతమైన వాటి వెనుక పడి.. మనశ్శాంతిని కోల్పోవద్దు.