Jobs In Hyderabad: హాల్ సెకండరీ స్కూల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 13 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. డిప్లొమా/డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ పాస్ కావడంతో పాటు సెంట్రల్/స్టేట్ లెవల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడటంతో పాటు పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ది ప్రిన్సిపల్,హాల్ సెకండరీ స్కూల్,హాల్ టౌన్‌షిప్,బాలానగర్, హైదరాబాద్–500042 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
Also Read: Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హరీశ్‌రావు.. వీహెచ్‌కు పైసలిచ్చిండట..!
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,000 రూపాయల నుంచి 22,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. http://halsecondaryschoolhyderabad.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ) 4 ఖాళీలు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ–సైన్స్) ఒక ఖాళీ, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ–సోషల్ సైన్స్) 1, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఆర్‌టీ–ఫిమేల్) 1, మ్యూజిక్ టీచర్ 1, కౌన్సిలర్ 1, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్ 1, నర్సరీ టీచర్ 1 భర్తీ చేయనున్నారు.
Also Read: AP Politics: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..