Guarantee vs Warranty: గ్యారెంటీ, వారంటీ ఈ రెండు పదాలను మనం నిత్యం వింటూనే ఉన్నాం. గ్యారెంటీ అనే పదం మనం వస్తువుల విషయాల్లో ఎక్కువగా వింటుంటాం. గ్యారెంటీ అంటే ప్రామిస్ అని అర్థం. ఇది మన జీవితంలో కూడా వింటుంటాం. గ్యారెంటీ అంటేనే కచ్చితంగా అని చెప్పే క్రమంలో ఇచ్చే ఒక హామీ అన్నమాట. అయితే కంపెనీలు వస్తువుల మీద ఇలాంటి గ్యారెంటీలు ఇస్తుంటాయి.

గ్యారెంటీ అంటే అది ఒకవేళ పాడైపోతే కొత్తగా ఇంకో వస్తువును ఇస్తారన్న మాట. కాగా వినడానికి ఒకే విధంగా అనిపించినా కూడా గ్యారెంటీకి, వారంటీకి చాలా తేడాలు ఉంటాయి. ఇక వారంటీ అంటే కంపెనీ వస్తువును అమ్మే సమయంలో మనకు ఒక సమయాన్ని ఇస్తారు. ఆ సమయంలోపు వస్తువు గనక పాడైపోతే దాన్ని రిపేర్ చేసి మనకు ఇస్తారన్న మాట.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
గ్యారెంటీ గురించి స్పష్టంగా చెప్పాలంటే.. మనం షాపుల్లో లేదంటే మార్కెట్లలో కొనే వస్తువుల మీద అమ్మకం దారుడు మనకు ఇచ్చే ఒక బలమైన హామీ. గ్యారెంటీ ఇచ్చాడంటే ఆ వస్తువు ఎప్పుడు పాడైపోయినా సరే దాని ప్లేస్‌లో కొత్తది కచ్చితంగా మనకు ఇచ్చి తీరాలి. అయితే ఈ సమయంలో మనకు గ్యారెంటీ కార్డు కచ్చితంగా ఉండాలి.

ఇక వారంటీ అంటే మనకు వస్తువు అమ్మే సమయంలో ఒక డేట్‌ను ఇస్తారు. ఆ డేట్ లోపు గనక ఆ వస్తువు పాడైపోయినా లేదంటే ఏమైనా చిన్న పాటి రిపేర్ వచ్చినా సరే ఆ వారెంటీ కార్డును తీసుకెళ్లి దాన్ని ఫ్రీగానే రిపేర్ చేయించుకోవచ్చు. అయితే ఈ రెండింటికీ సెపరేటు నియమ, నిబందనలు ఉంటాయి. కాబట్టి వాటిని కచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది.
Also Read: ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్
[…] Car Wheels: కారు డ్రైవింగ్ అన్నా లేదంటే కారు జర్నీ అన్నా కూడా చాలా ఎంజాయింగ్ గా అనిపిస్తుంది. అయితే సినిమాల్లో కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు మనం చూస్తే కారు ముందుకు వెళ్తున్నా కూడా వీల్స్ మాత్రం వెనక్కు వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఇది మనందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. అయితే అవి అలా ఎందుకు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. […]