https://oktelugu.com/

plant at home : ఈ మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకున్నట్లే…

  చెట్ల వల్ల మనుషులకు అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన గాలితోపాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 27, 2024 / 12:35 PM IST

    plant at home

    Follow us on

    plant at home :  చెట్ల వల్ల మనుషులకు అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన గాలితోపాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అయితే నేటి కాలంలో నగరీకరణ పేరుతో చెట్లను నరికి వేస్తున్నారు. కానీ కొందరు చెట్లపై అవగాహన పెంచడంతో మళ్లీ మొక్కలు నాటుతున్నారు. నగరాల్లో ఉండేవారు మొక్కలు నాటేందుకు సరైన ప్రదేశాలు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఇంట్లోనే మొక్కలను ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అయితే మొక్కలు నాటే ముందు అవి మంచివో? కావో? తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇలాంటి మొక్కలు ఇంట్లోగాని.. ఇంటి ముందర గాని.. నాటడం వల్ల మంచి కంటే చెడు ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ ఆ మొక్కలు ఏవో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇది చదవండి..

    కొందరు అందంగా కనిపించే మొక్కలు ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు పూలు అందించే మొక్కలు పూల కుండీలో పెడతారు. చాలామంది పూల కోసం మొక్కలను పెట్టే వారే ఉంటారు. వీటితో పూజలు లేదా ఇతర అవసరాలు తీర్చుకుంటారు. పూజల్లో జిల్లేడు పూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శివారాధన చేసేవారు జిల్లేడు పూలతో శంకరుడికి అలంకరణ చేస్తారు. అలాగే వినాయకుడిని కూడా జిల్లేడు పూలతో పూజ చేస్తారు. కానీ జిల్లేడు మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జిల్లేడు మొక్కల ఆకుల నుంచి పాల లాంటి ద్రవం కారుతుంది. దీని నుండి వెలువడే ఎనర్జీ ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇది ఇంటి ముందర లేదా ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల జిల్లేడు మొక్కను ఎట్టి పరిస్థితుల్లో పెంచుకోకుండా ఉండాలి.

    కాక్టస్ మొక్కల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి అలంకరణకు పనికొస్తాయి. ఇవి చూడడానికి అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్రాన్ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా చితికి పోతారు. ఏ పని చేపట్టిన నష్టాలే ఉంటాయి.
    నాగజెముడు లాంటి ముళ్ళు కలిగిన మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోవద్దని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇవి ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎప్పటికీ చికాకులు కలుగుతాయి. కొందరు నిత్యం అనారోగ్యంతో ఉంటారు. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. అందువలన ఇలాంటి మొక్కలను పెంచుకోవడం మానుకోవాలి.

    ఖర్జూర పండు గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల అధిక శక్తి లభిస్తుంది . ఖర్జూరాలు మన దేశంలో చాలా తక్కువగా పండుతాయి. అందువల్ల వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కొందరు ఖర్జూర చెట్లను ఇంటి వద్ద పెంచుకోవాలని అనుకుంటారు. కానీ ఖర్జూర చెట్లను పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కుటుంబంలో ఎప్పుడు అశాంతి నెలకొంటుంది. వ్యాపారులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.