https://oktelugu.com/

CM Revanth Reddy: ఆ విషయంలో రేవంత్ రెడ్డి నెంబర్ వన్.. అందుకే ఆయన పనితీరుకు అన్ని వర్గాల నుంచి మెచ్చుకోలు!

తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వారి పురో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 24, 2024 / 11:38 AM IST

    CM Revanth Reddy(6)

    Follow us on

    CM Revanth Reddy: సమాజంలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎంత వివక్షకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారికి ఉపాధి కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇది అన్ని వర్గాల ప్రజల నుంచి మెచ్చుకోలను పోదుతోంది. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాక అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రేవంత్ రెడ్డి ఈ పని మొదలుపెట్టారు. సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ సహకారంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. అందులో ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. వారికి ఉపాధి కల్పించడానికి ఈ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసింది. దీనికోసం రెండున్నర కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పెట్రోల్ బంకును సిరిసిల్ల పురపాలక పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఏర్పాటు చేసింది..ఈ పెట్రోల్ బంక్ లో ఒక ట్రాన్స్ జెండర్, 24 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. దానికంటే ముందు వీరికి పెట్రోల్ బంక్ నిర్వహణలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం ఉదారమైన నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఆర్థికంగా స్థిరత్వం లభించింది.

    వారిలో సంతోషం

    ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగుల్లో సంతోషం వెల్లి విరుస్తోంది. ప్రభుత్వం ఉపాధి కల్పించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. బంక్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చి.. ఉద్యోగం ఇవ్వడం పట్ల వారు ఉబ్బి తబ్బిబవుతున్నారు. తమకు జీవనోపాధి కలిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉందని దివ్యాంగులు చెబుతున్నారు. తమలాంటి వారికోసం ఇలాంటి ఆలోచన చేయడం ఆనందంగా ఉందని వారు వివరిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో ఉద్యోగం చేయడం వల్ల తమకు నెలకు 18 దాకా వేతనం వస్తుందని దివ్యాంగులు చెబుతున్నారు.

    వివిధ జిల్లాల్లో..

    కేవలం సిరిసిల్లలో మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆయా జిల్లాల అధికారులతో ప్రయత్నాలు చేస్తోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలతో ఉండడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో రాష్ట్ర మొత్తం దివ్యాంగులతో, ట్రాన్స్ జండర్లతో పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సంకేతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు.