Google Features: గూగుల్ లో న్యూ ఫీచర్.. దీని ఉపయోగమేంటంటే?

గూగుల్ పేజీ ఓపెన్ చేసింది. ఇందులో Data & Security అనే ఆప్షన్ ను యాక్టివ్ చేసుకోవాలి. ఆ తరువాత విజువల్ సెర్చ్ హిస్టరీపై క్లిక్ చేసి ఉంచాలి. అయితే ఇది అప్డేట్ చేసిన బ్రౌజర్ లో మాత్రమే కనిపిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : March 11, 2024 10:24 am

Google Search

Follow us on

Google Features:నేటి కాలంలో మొబైల్ కొనుగోలు విషయంలో వినయోగదారుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొందరు తమ పనులను సులభంగా చేసుకునేందుకు అనువైన సౌకర్యాలు వస్తున్నాయి. తాజాగా గూగుల్ కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో గూగుల్ లెన్స్ ద్వారా కొన్ని ఫొటోలను, టెక్ట్స్ ను తీసుకుంటే కేవలం మొబైల్ లో మాత్రమే వచ్చేది. కానీ దీనిని సేవ్ చేసుకోకుంటే అది డెలిట్ అయ్యేది. కానీ ఇప్పుడు దీనిని పూర్తిగా మార్చారు. అంతేకాకుండా మొబైల్ తో పాటు ల్యాప్ టాప్ లో ఒకేసారి సేవ్ అవుతుంది. అదెలాగో ఒకసారి చూద్దాం..

ఇప్పటి వరకు గూగుల్ లెన్స్ ద్వారా ఏదైనా ఇమేజ్ ను స్కాన్ చేస్తే అది గూగుల్ లోకి వెళ్లి మాయమైపోతుంది. ఇది మొబైల్ లో ఎక్కడా సేవ్ అయ్యేది కాదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు. కానీ ఇప్పుడు లెన్స్ తో ఫొటో క్యాప్సర్ చేయగానే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఫోన్ లో మాత్రమే కాకుండా నేరుగా ఒకే సమయంలో ల్యాప్ టాప్ లో కూడా సేవ్ అవుతుంది. దీంతో మీరు కావాలనుకున్న ఇమేజ్ ను వెంటనే దూరం చేసుకోకుండా మొబైల్ లో నిక్షిప్తం చేసుకోవచ్చు.

ఈ ప్రక్రియ సాగడానికి మొబైల్ లో ఎలాంటి ఆప్షన్ ఉండదు. దీని కోసం ప్రత్యేకంగా సెట్ చేసుకోవాలి. గూగుల్ పేజీ ఓపెన్ చేసింది. ఇందులో Data & Security అనే ఆప్షన్ ను యాక్టివ్ చేసుకోవాలి. ఆ తరువాత విజువల్ సెర్చ్ హిస్టరీపై క్లిక్ చేసి ఉంచాలి. అయితే ఇది అప్డేట్ చేసిన బ్రౌజర్ లో మాత్రమే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది భవిష్యత్ లో అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యం వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది.

ఇప్పటి వరకు ఉన్న మొబైల్ లో గూగుల్ పిక్సెల్ 4 వంటి ఫోన్లలో గూగుల్ లెన్స్ నేరుగా పనిచేస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా లెన్స్ ను డౌన్లోడ్ చేయాల్సి అవసరం లేదు. కానీ ఇది లేని వారు మాత్రం ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా మొక్కలు, జంతువులను కూడా గుర్తించేందుకు ఉపయోగించవచ్చు.