ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే ఫీచర్ కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి రాగా తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్ ను మరింత సులభతరం చేసింది. యుపీఐ పేమెంట్స్ కు సంబంధించి వాట్సాప్ మార్పులు చేయగా ఇకపై పిన్ సింబల్ ను క్లిక్ చేసి పేమెంట్స్ లోకి వెళ్లాలి.
చాట్ కంపోజర్ లో రూపీ సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా పేమెంట్స్ ను పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ లో కెమెరాను వినియోగించి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాట్సాప్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరైన మహేష్ మనాత్మే ఒక సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. వాట్సాప్ ద్వారా సులువుగా పేమెంట్లు చేయడానికి రూపీ సింబల్ ను యాడ్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గతేడాది పేమెంట్స్ సేవలను ప్రారంభించడానికి అనుమతులను ఇచ్చింది. వాట్సాప్ మొదట 20 మిలియన్ మందికి వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా ఈ సంఖ్యను దశల వారీగా పెంచుతామని మహాత్మే అన్నారు. అతి త్వరలో కొన్ని మార్కెటింగ్ ప్రయత్నాలను కూడా మొదలుపెడతామని మహాత్మే చెప్పుకొచ్చారు.
గూగుల్ పే, ఫోన్ పే తరహాలో వాట్సాప్ స్క్రాచ్ కార్డులను సైతం తీసుకురానుందని తెలుస్తోంది. స్క్రాచ్ కార్డులు అందుబాటులోకి వస్తే వాట్సాప్ ద్వారా పేమెంట్లు చేసేవాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
