spot_img
Homeలైఫ్ స్టైల్Buy A Car Under Rs 10 Lakhs: రూ 10 లక్షల లోపు కారు...

Buy A Car Under Rs 10 Lakhs: రూ 10 లక్షల లోపు కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ఈ సబ్ కాంపాక్ట్ SUV మీ కోసమే..

Buy A Car Under Rs 10 Lakhs: ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా కారు ఉండడం చాలా అవసరం. కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీతో టూర్ కి వెళ్లడానికి ఫోర్ వెయికల్ తప్పనిసరిగా మారింది. అయితే సామాన్యులు సైతం సొంత కారు ఉండాలని కోరుకుంటున్న తరుణంలో బడ్జెట్ కార్ల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. వీరి కోసం కొన్ని కంపెనీలు 10 లక్షల లోపు కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రీమియం కార్ల ఫీచర్లతో సహా పోటీ పడుతూ కొన్ని కార్లు తక్కువ ధరకే రావడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లేటెస్ట్ గా Skoda కంపెనీకి చెందిన ఓ కారు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ రూ. 10 లక్షలు ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా దీనికోసం బుక్ చేసుకుంటున్నారు. అయితే అంతలా ఈ కారులో ఏముందనే విషయం చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఈ కారు ఎలా ఉందంటే..?

SUV కారు కొనాలని చాలామంది అనుకుంటారు కానీ వీటి ధరలు అధికంగా ఉంటాయి ఈ నేపథ్యంలో సబ్ కాంపాక్ట్ SUV కార్లు ఆకర్షిస్తుంటాయి. సబ్ కాంపాక్ట్ SUV వేరియంట్ లో Skoda కంపెనీ నుంచి Kylaq అనే కారును నవంబర్లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే దీని బుకింగ్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమైంది. Skoda Kylaq మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ ఉన్నాయి. ఇవి మొత్తం ఏడు రంగులలో విక్రయాలు జరుపుకుంటున్నాయి.

స్కోడా కైలాక్ కార్లలో ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి ఇందులో ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రిక్ రింగ్ మిర్రర్ వంటివి ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా వీటిల్లో 6 ఎయిర్ బ్యాగ్స్, టిల్ట్, టెలిస్కోప్ స్టీరింగ్ విల్ ఉన్నాయి. వీటిలో కైలాక్ ప్రెస్టీజ్ ఇంజన్ విషయానికొస్తే.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది 114 bhp పవర్, 178 nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. ఈ కారు 10 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
స్కోడా 4 కార్లు వివిధ ధరలతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్లాసిక్ కారు 9.35 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. సిగ్నేచర్ మోడల్ 11.35 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు. సిగ్నేచర్ ప్లస్ 13.93 లక్షలతో అందుబాటులో ఉంది. ప్రెస్టీజ్ 16.30 లక్షల తో విక్రయిస్తున్నారు. అయితే కొత్తగా కారు కొనాలని అనుకునేవారు క్లాసిక్ కారును ఎంచుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఇతర చార్జీలతో కలిపి దీనిని రూ. 10 లక్షల లోపు సొంతం చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి కాకుండా ఈఎంఐ పద్ధతిలోనూ ఈ కారును కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కంపాక్ట్ ఎస్ యు వి కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో స్కోడా కైలాక్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Oktelugu Epaper