Software Jobs: రాష్ర్టంలో ఐటీ కంపెనీలు బలోపేతం అవుతున్నాయి. గతంలో సాఫ్ట్ వేర్ పడిపోడంతో కష్టాల్లో ఉన్న కంపెనీలు ప్రస్తుతం పుంజుకున్నాయి. దీంతో వేతనాలు పెంచుతూ తమ సంస్థలను బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే వేతన ప్యాకేజీలు పెంచుతున్నాయి. గతంలో ఎన్నడు లేనంతగా వార్షిక వేతన ప్యాకేజీలు పెరగడంతో ఉద్యోగులకు కూడా లాభం చేకూరుతోంది. వార్షిక వేతనం లక్షల్లో ముట్టజెబుతూ పనితీరును బాగు చేసుకోవాలని భావిస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ కంపెనీల ఆఫర్ తో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి. పోటీ పడుతూ పారితోషికాలు అందజేయడంతో ప్యాకేజీల కోసం ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నారు. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ గా ఎంపికైన వారికి భారీ రెమ్యూనరేషన్ అందించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వారికిచ్చే వేతనం రూ. 33 లక్షల నుంచి రూ.44 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగినదే.
Also Read: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌లో జాబ్స్.. ఎవరు అర్హులంటే?
కరోనా కారణంగా రెండు సంవత్సరాలు కష్టాలు ఎదుర్కొన్నా ప్రస్తుతం మాత్రం కంపెనీలు పుంజుకున్నాయి. దీంతో ప్రాంగణ నియామకాలకు పచ్చజెండా ఊపుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల నియామకంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచుకునే క్రమంలో ఎక్కువ మందిని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నాయి.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ కంపెనీలను బిగ్ కంపెనీలుగా పరిగణిస్తారు. ప్రతిభ గల అభ్యర్థులకు అధిక వేతనాలిస్తూ నియమించుకునేందుకు ఉపక్రమించాయి. తక్కువ మందిని తీసుకుని ఎక్కువ మొత్తంలో వేతనాలిస్తూ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇంకా పలు కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తూ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పంట పండినట్లే అని చెబుతున్నారు.
Also Read: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ బోర్డ్ లో 691 ఉద్యోగ ఖాళీలు.. రూ.38,000 వేతనంతో?