Sankranti 2022 Movies: దేశం మొత్తం మళ్ళీ కరోనా మయం అయిపోయేలా ఉంది. ఆ స్థాయిలో కేసులు పెరుగుతుండడంతో చిన్న సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ లను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నాయి. సంక్రాంతి టార్గెట్ గా రావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు గత వారమే రేసులో నుంచి తప్పుకున్నాయి. దాంతో ఒక్కసారిగా చిన్న సినిమాలు పోటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ పోటీ కనబడే పరిస్థితి లేదు. సంక్రాంతి బరి నుంచి తాజాగా ఒక చిన్న సినిమా తప్పుకుంది.

ఒకప్పటి ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వంలో రాబోతున్న బోల్డ్ సినిమా “7 డేస్ 6 నైట్స్” . కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామంటూ రాజుగారు చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని “7 డేస్ 6 నైట్స్” టీం ప్రకటించింది.
ఏమిటో రాజు గారు ? ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనేవారు. పైగా యావత్తు తెలుగు సినీ జనం ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు. అసలు ఎం.ఎస్ రాజు అంటేనే భారీ సినిమాలు అనే ముద్ర పడిపోయింది. అలాగే ఆయన ఆలోచనల శైలి కూడా అంతా భారీ తనంగానే ఉండేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఆయన నష్టాల పాలు అయ్యారు. దాంతో ఆయన ప్రభ, వైభవం అంతా గతం అయిపోయింది.
Also Read: అతిథి పాత్రల్లో ఆశ్చర్య పరిచిన స్టార్లు వీళ్లే !
ఇక పెద్దరికం కూడా వచ్చేసింది. అయితే, ఆయన మనసు ఈ వయసులో బూతు మయం అయింది. ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటే ఉన్న పేరుకి ఇప్పటి ఆయన పేరుకి చాలా తేడా ఉంది. ఏది అయితే ఏం రాజుగారు బూతు సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి సిద్ధపడ్డారు. దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ అనే బూతు సినిమా తీసి హిట్ కొట్టారు.
దాంతో రాజుగారికి డైరెక్టర్ గా మరో సినిమా వచ్చింది. నిజానికి ‘డర్టీ హరి’ కేవలం బోల్డ్ నెస్ తోనే హిట్ అయింది. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగిన ఆ సినిమా నిండా బూతులు, బోల్డ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అందుకే ఆయన మళ్ళీ బూతు సినిమాకి శ్రీకారం చుట్టి.. ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ తో మరో బోల్డ్ సినిమా చేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది.
Also Read: ‘పుష్ప’ పై సినీ ప్రముఖుల అతి ప్రేమ !