Gold, Silver Prices: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన దేశంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు కళ్లు చెదిరే స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరల వల్ల బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్లు సైతం వెనక్కు తగ్గుతుండటం గమనార్హం. అయితే నిపుణులు మాత్రం సాధారణ పరిస్థితులు ఏర్పడితే బంగారం, వెండి ధరలు తగ్గుతాయని చెబుతున్నారు.
ఎంసీఎక్స్ లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారం ధర 54,965 రూపాయలుగా ఉండగా కేజీ వెండి ధర 72,960 రూపాయలుగా ఉండటం గమనార్హం. మన దేశంలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి 49,800 రూపాయలకు చేరుకుంది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల(916) బంగారం 50,000 రూపాయలకు చేరువ కావడం గమనార్హం.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయలు పెరిగి 54,330 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో ఈ ధరలు అమలవుతున్నాయి. వెండి ధరలను పరిశీలిస్తే కిలో వెండి ధర ఏకంగా 1,200 రూపాయలు పెరిగి 71,200 రూపాయలుగా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ ధర ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మాత్రం కిలో వెండి ధర 76,700 రూపాయలుగా ఉండటం గమనార్హం.
