Goddess Lakshmi : చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతగానో ఎదురు చూసే హోలీ పండుగ వచ్చేస్తుంది. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను దక్షిణాది రాష్ట్రాలు కంటే ఉత్తరాది రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటాయి. ప్రతీ ఏడాది హోలీ పండగను ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది హోలీ పండగను మార్చి 14వ తేదీన జరుపుకుంటారు. పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీన ప్రారంభమై.. మార్చి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలోనే హోలీ జరుపుకోవాలి. అయితే హోలికా దహనాన్ని మాత్రం మార్చి 13వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. హోలీ పండుగను లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ పండుగ నాడు లక్ష్మీదేవిని ఎంతో భక్తితో పూజిస్తారు. ఉదయాన్నే లేచి ఇంట్లో పూజలు నిర్వహించి హోలీ పండుగను జరుపుకుంటారు. కుటుంబంలోని అందరూ రంగు రంగులతో ఎంతో మంచిగా హోలీ జరుపుకుంటారు. అయితే కొందరికి తెలియక హోలీ రోజు కొన్ని తప్పులు చేస్తుంటారు. హోలికా దహనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ దహనం సమయంలో ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుతారు. వీటివల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. అయితే హోలికా దహన సమయంలో ఇంట్లో ఉంచకూడదని ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండే రాశులు ఇవే.. మీ రాశి ఉందా ఇందులో?
పాత చెప్పులు
హిందువులు ప్రతీ పండుగకి ఇంటిని శుభ్రం చేస్తుంటారు. ఈ సమయంలో పనికిరాని వస్తువులను బయట పడేస్తుంటారు. కానీ కొందరు మాత్రం చెప్పులను ఇంట్లోనే ఉంచుతారు. మీరు రోజు వాడే చెప్పులు కాకుండా వాడకుండా ఉంచేసిన చెప్పులు పడేయాలి. వీటిని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి ఇంటికి రాదు. ఎంత కష్టపడినా కూడా ఇంట్లో డబ్బు ఉండదు. కాబట్టి చిరిగిన పాత చెప్పులను ఇంట్లో ఉంచకుండా పడేయండి.
పగిలిన వస్తువులు
ఇంట్లో విరిగినా లేదా పగిలిన వస్తువులను ఉంచుకోకూడదు. వీటివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పగిలి ఉన్న దేవుని ఫొటోలు, అద్దం వంటి వాటిని ఒక నదిలో వదిలేయాలి. ఇవి ఇంట్లో ఉంటే ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఇంట్లో ఉండాలంటే ఈ వస్తువులు ఇంట్లో ఉండకూడదు.
చీపురు
ఇంట్లో ఎల్లప్పుడూ కొత్తగా ఉన్న చీపురు ఉండాలి. బాగా అరిగిపోయిన చీపురు ఉంటే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. పాత చీపురును పడేసి కొత్త చీపురును కొనుక్కోవాలి. అయితే పాత చీపురు బయట చెత్తలో పడేయకుండా మట్టిలో నానబెట్టాలని పండితులు చెబుతున్నారు. కొత్త చీపురు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
తులసి చెట్టు
ఇంట్లో తులసి చెట్టును పెంచడం వల్ల అంతా పాజిటివిటీ ఉంటుంది. అయితే ఎండిపోయిన తులసి చెట్టును ఇంట్లో ఉంచకూడదు. ఇలాంటి చెట్టు ఉంటే దాన్ని తీసేసి కొత్త మొక్కను ఈ హోలీ రోజు పెట్టండి. దీనివల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
.
Also Read : భోగి రోజు ఇలా చేస్తే ఆ లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ముఖ్యంగా ఆ పువ్వుతో ఇలా చేయడం మర్చిపోవద్దు.