
Goddess Lakshmi: సిరిసంపదలకు నిలయంగా లక్ష్మీదేవిని కొలుస్తాం. మన ఇంట్లో సంపదలు కలగాలని ఆకాంక్షిస్తాం. లక్ష్మీ కటాక్షం కావాలని ఆరాటపడుతుంటాం. ఇంట్లో దారిద్ర్యం దూరం కావాలని ఆశిస్తాం. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని తపిస్తాం. ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువుండాలని కోరుకుంటాం. అందుకు కావాల్సిన పరిహారాలు సైతం పాటిస్తాం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని పూజలు చేస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఇంకా ఏ సమస్య ఉండదని భావిస్తాం. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
లక్ష్మీదేవి కొలువుండాలంటే..
ఇంట్లో లక్ష్మీ దేవి కొలువుండాలంటే మొట్టమొదట మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. చెత్తాచెదారంతోనిండిపోయిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. దారిద్ర్యమే తాండవిస్తుంది. అందుకే మన ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త పడాలి. అమ్మవారి విగ్రహాన్ని తప్పుడు దిశలో ఉంచితే కూడా ఆమెకు ఆగ్రహం వస్తుంది. లక్ష్మీదేవిని ఏ దిశలో ఉంచాలో తెలుసుకుని మరీ సరైన దిశలో ఉంచితే ప్రయోజనం కలిగేలా చేస్తుంది. వాస్తు ప్రకారం లక్ష్మీదేవిని పూజిస్తే మనకు సకల శుభాలు కలగజేస్తుంది.
విగ్రహాన్ని ఏ దిశలో..
లక్ష్మీదేవి విగ్రహాన్ని నిర్దిష్టమన దిశలో ఉంచితేనే సత్ఫలితాలు వస్తాయి. అంతేకాని అపసవ్య దిశలో ఉంచితే ప్రతికూల ప్రభావాలే కలుగుతాయి. పొరపాటున కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. అలా చేస్తే మన ఇంట్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఖాయం. దక్షిణాదికి యముడు అధిపతిగా ఉంటాడు. అలాంటి దిక్కులో లక్ష్మీదేవిని ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా ఎన్నో నష్టాలు సంభవిస్తాయి.
ఉత్తర దిశలో..
లక్ష్మీదేవి విగ్రహం, చిత్రపటాన్ని ఉత్తర దిశలోనే ఉంచాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కావడంతో విష్ణుమూర్తికి ఇష్టమైన దిశ కావడంతో లక్ష్మీదేవిని ఉత్తరం వైపు ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సంపదలు పెరుగుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధనలక్ష్మి తాండవిస్తుంది. దీంతో మనకు లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవిని ఉత్తర దిశలో ఉంచుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి.
నిలువెత్తు బొమ్మను..
లక్ష్మీదేవి నిలువెత్తు బొమ్మను ఇంట్లో ఉంచుకోకూడదు. లక్ష్మీదేవి నిలబడినట్లు ఉండే విగ్రహం కాని చిత్రపటం కాని ఉంచుకుంటే మంచిది కాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని వదిలిపెట్టి వేరే వాళ్ల ఇంటికి వెళుతుందని చెబుతారు. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కూర్చున్నట్లు ఉండే చిత్రపటాన్ని పెట్టుకుంటే మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. నిలబడి ఉండే చిత్రపటం ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు. మన ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళుతుందని చెబుతుంటారు.

ఒకటే ఉండాలి
లక్ష్మీదేవి చిత్రపటం కాని విగ్రహం కాని ఒకటే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉండటం వల్ల అశుభంగానే చెబుతారు. లక్ష్మీదేవి విగ్రహాలైనా చిత్రపటాలైనా ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ అలా ఉంచుకుంటే మనకు నష్టాలే ఎక్కువ. ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని పూజించే వారు కచ్చితమైన నియమాలు పాటించి మంచి ఫలితాలు కలిగేందుకు దోహదపడే విధంగా పూజలు చేసుకోవడం మంచిది. ఎంత నిష్టగా పూజ చేస్తే అంత బాగా మనల్ని అనుగ్రహిస్తుంది.