Homeలైఫ్ స్టైల్Global Immigration: ఇక డబ్బున్నోళ్లు ఫారిన్ లో సెటిల్ కావడం చాలా ఈజీ.. ఈ దేశాల...

Global Immigration: ఇక డబ్బున్నోళ్లు ఫారిన్ లో సెటిల్ కావడం చాలా ఈజీ.. ఈ దేశాల మీదే వాళ్లకు ఎందుకింత ఇంట్రెస్ట్

Global Immigration: దేశంలో డబ్బులు ఉన్నవాళ్లంతా ఈ మధ్య కాలంలో చాలా స్పీడుగా ఫారిన్ వెళ్లి అక్కడే సెటిల్ అవుతున్నారు. దీని కారణంగా ప్రతేడాది వేల సంఖ్యలో భారతదేశానికి చెందిన ధనవంతులు దేశం విడిచి ప్రపంచంలోని వివిధ దేశాలకు వలస వెళ్తున్నారు. విదేశాల్లో స్థిరపడాలనే ఆసక్తిని గమనించి, ఇమ్మిగ్రేషన్ కంపెనీలు భారతీయుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు సంపాదించే వారికి కూడా ఈ కంపెనీలు ఆఫర్లు తీసుకువస్తున్నాయి. మీరు నెలకు ఐదు నుండి పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నా, లేదా ఏదైనా స్టార్టప్ లేదా హోటల్‌లో కొన్ని వేల డాలర్లు పెట్టుబడి పెట్టగలిగినా, లేదా కేవలం ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయగలిగినా, ఒక గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ కంపెనీ మిమ్మల్ని అనేక దేశాల్లో సెటిల్ అయ్యేలా చేస్తామని చెబుతోంది. విదేశాల్లో అందుబాటులో ఉన్న దేశాల్లో ఫ్రాన్స్, ఇటలీ నుండి ఈజిప్ట్, గ్రెనడా వరకు ఉన్నాయి.

గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ కంపెనీ గ్యారెంట్.ఇన్ వ్యవస్థాపకుడు ఆండ్రూ బోయికో మాట్లాడుతూ.. విదేశాల్లో సెటిల్ కావడానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఉదాహరణకు, మీరు హైదరాబాదులో ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తే, అది మీకు ఇటలీలో నివసించే అవకాశాన్ని కల్పించదు. కానీ, మీరు అదే ధరకు ఇటలీలో ఒక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తే, మీరు అక్కడ లేదా యూరప్‌లో ఎక్కడైనా నివసించవచ్చు. అంతేకాకుండా అనేక ఇతర దేశాలకు ఈజీగా వెళ్ళగలరని ఆయన వివరించారు.

ఆండ్రూ బోయికో చెప్పిన దాని ప్రకారం వారి కంపెనీకి కేవలం మూడు నెలల్లో భారతదేశం నుండి 4,000 కంటే ఎక్కువ రిక్వెస్టులు వచ్చాయి. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దేశాలలో ఫ్రాన్స్, ఇటలీ, ఈజిప్ట్, గ్రెనడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులలో ఒక ముఖ్యమైన విషయం గమనించానని తెలిపారు. అదేంటంటే, విదేశాలకు వెళ్లే విషయంలో కూడా ఇండియన్స్ ఇన్వెస్టర్ల లాగే ఆలోచిస్తారని ఆయన అన్నారు.

Also Read: Multiple credit cards: ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయా?

భారతీయులు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారని అన్నారు. వారు ఎటువంటి ప్రయోజనం లేకుండా విరాళాలు ఇవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు తమ డబ్బును తిరిగి పొందాలనుకుంటారని ఆయన చెప్పారు. వారు తమ ఇన్వెస్ట్ మెంట్ పై రాబడిని కూడా కోరుకుంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడే ఆర్థిక స్వాతంత్ర్యం, ఇన్వెస్టెంట్ ప్రొగ్రామ్స్ విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రోగ్రాం కింద, ఒక వ్యక్తికి ఏదైనా దేశంలో నివాసం పొందడానికి ఒక నిర్దిష్ట పరిమితికి మించి స్టేబుల్ ఇన్ కం ఫ్లో చూపించాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రూల్స్ లోబడి, ఇది పౌరసత్వంగా మారుతుంది. ఇది భారతీయులకు తమ డబ్బును తెలివితో పెట్టుబడి పెట్టడానికి, భవిష్యత్తులో ప్రయోజనాలను పొందడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular