Marriage: ప్రతీ వ్యక్తికి జీవితంలో అతి ముఖ్యమైన పండుగ పెళ్లి. ఈ పెళ్లిని అంగరంగవైభవంగా జరుపుకోవాలని, అతిరథుల మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ పెళ్లి సెట్ కాగానే ఎన్నో టెన్షన్స్, తీరికలేని పనులు ఉంటాయి. ఈ టెన్షన్లో చేయాల్సిన పనులన్నీ మరిచిపోతూ ఉంటారు. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధుత్వం ఏర్పడుతున్నందున ఇరు కుటుంబాల్లో హడావుడి ఉంటుంది. వధూవరులిద్దరికి ఒకే రకమైన కార్యక్రమం కనుక ఇద్దరి ఇళ్లల్లోనూ సందడి ఉంటుంది. కానీ అప్పటి వరకు పుట్టినింట్లో మెలిగిన అమ్మాయి ఇప్పుడు మెట్టినింటి గడప తొక్కనుంది. ఈ క్రమంలో అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటున్నామన్న ఆనందంతో పాటు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నామన్న భయం ఉంటుంది. ఈ భయంలో తన పెళ్లిలో చేయాలనుకున్న పనులన్నింటినీ మరిచిపోతూంటారు. అయితే అలా మరిచిపోకుండా ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ ప్రకారం వస్తువులన్నీ సెట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అంటున్నారు.

పెళ్లి అనగానే అబ్బాయిలకంటే అమ్మాయిలకు రెండు రకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఒకటి కొత్త వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకోబోతున్న ఆనందం.. మరొకటి అత్తారింట్లో అడుగుపెడున్నామన్న భయం.. దీంతో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిల్లో చాలా మంది ముహబావంగానే ఉంటారు. ఈ క్రమంలో తాము చేయాలనుకున్న పనులు చేయలేకపోతుంటారు. అయితే ఇలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ప్రతీ అమ్మాయి జీవితంలో జరిగిదిదే.. అలాంటప్పుడు దీనిని పెద్ద సమస్యగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.
Also Read: F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?
పెళ్లి తంతు మొదలవగానే అమ్మాయిలు అన్నీ చేయాలనుకుంటారు. కానీ హడావుడిలో చాలా మరిచిపోతారు. ముఖ్యంగా మేకప్ కిట్. ఈ మేకప్ కిట్ సరైన సమయానికి దొరకకపోతే ఆందోళనకు గురవుతుంటారు. అయితే పెళ్లికి సంబంధించిన మేకప్ కిట్ ను సాధారణ వస్తువులతో జోడించకండి. దానిని సెపరేట్ గా పెట్టుకోండి. అవసరమైతే ఈ మేకప్ కిట్ ను పెళ్లి రోజు వరకు బయటకు తీయకుండా జాగ్రత్తపడండి.
చాలా మంది పెళ్లి కూతుళ్లు పెళ్లిలో ఆందోళనగా ఉంటారు. ఏదో జరుగుతుందన్న భయంతో ఉంటారు. ఈ క్రమంలో సరైన ఆహారం తీసుకోరు. అంతేకాకుండా కనీసం మంచినీరు కూడా తాగడానికి ఇష్టపడరు. అయితే ఇలా చేయడం వల్ల ఫేస్లో గ్లో పోతుంది. సరైన ఆహారం, కావాల్సిన నీరు తీసుకోవాలి. అంతేకాకుండా కంటినిండా నిద్రపోవాలి. పెళ్లి చేసుకోబోయే వారు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల అందంగా కూడా కనిపిస్తారు.

పెళ్లి చేసుకోబోతున్న విషయం స్నేహితులందరికీ ముందే తెలియజేయండి. పెళ్లి పనులు మొదలయ్యాక స్నేహితులను మరిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఆ తరువాత బాధపడుతారు. వీటితో పాటు బంధువులతో సరదాగా ఉండండి. ముహబావంగా ఉండడం వల్ల మీ గురించి వారికి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అందరితో సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి.
పెళ్లి కోసం ఎన్ని కొన్నా ఏదో ఒకటి మరిచిపోతూంటారు. ముఖ్యంగా సేప్టి పిన్నులు. ఇవి సమయానికి దొరకక చాలా ఇబ్బంది పడుతారు. అందువల్ల వీటిని ముందే ఒక బాక్స్లో వేసుకొని అందుబాటులో ఉంచుకోండి. ఆ సమయంలో షాపింగ్ వెళ్లాలంటే కుదరదు. అంతేకాకుండా పెళ్లి కోసం కొనుగోలు చేసిన సామగ్రిని సెపరేట్ పెట్టుకోండి. వాటిని పెళ్లి రోజు మాత్రమే ఉపయోగించండి. వీటిని మేకప్ బాక్సు లో ఉంచితే అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం వేసవి కాలం. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ క్రమంలో మీతో పాటు వాటర్ బాటిల్ ను ఉంచుకోండి. అవసరమైనప్పుడల్లా నీరు తాగడం మంచిది. వేసవికాలం పెళ్లి ఇబ్బందే. కానీ అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Also Read:Sreemukhi: సర్వం ధారపోసిన శ్రీముఖి.. మత్తెక్కినట్టు మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !