Marriage Life: శోభనం కంటే ముందు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివీ

పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినైనా చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావొద్దు. ఆకర్షణకు లోనై పెళ్లి చేసుకోవద్దు. వివాహం చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి.

Written By: Raj Shekar, Updated On : March 7, 2024 4:36 pm

Marriage Life

Follow us on

Marriage Life: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. ఈ విషయంలో అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఎక్కువగా ఆలోచించి ముందడుగు వేయాలి. కొంచెం తేడా వచ్చినా జీవితంపై ప్రభావం చూపుతుంది. గతంలో పెళ్లి పెద్దల నిర్ణయం మేరకు జరిగేది. ఇప్పుడు అలా జరుగడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతీ యువకుల ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. అందుకే వైవాహిక జీవితంలో అడుగు పెట్టే ముందు కొన్ని విషయాలను చెక్‌ చేసుకోవడం చాలా అవసరం.

వెంటనే నిర్ణయానికి రావొద్దు..
పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినైనా చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావొద్దు. ఆకర్షణకు లోనై పెళ్లి చేసుకోవద్దు. వివాహం చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి.

తేడా గమనించాలి..
సమాజంలో సంబంధాలు, అనుబంధాలు తాత్కాలికం లేదా అవసరాల వరకే అన్నట్లు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ వ్యక్తితో అయినా కొంతకాలం జీవించడం లేదా ఆ వ్యక్తితో జీవితాంతం గడపడం అనే తేడాగు గమనించాలి. కొంతకాలం రిలేషన్‌లో ఉండి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కోవడం అది అత్యంత చెత్త నిర్ణయం కావొచ్చు. అందుకే మీరు పెళ్లికి ముందు భాగస్వామిలో కొన్ని విషయాలను చెక్‌ చేయాలని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు. అవి తనిఖీ చేయకపోవడం, సర్దుకుపోయే తత్వం తగ్గిపోవడంతో చాలా జంటలు విడిపోతున్నాయని పేర్కొంటున్నారు.

ప్రవర్తన తెలుసుకోవాలి..
మీ భాగస్వామికి మీకన్నా ఎక్కువ డబ్బు ఉంటే మీపట్ల ఎక్కువ ఆసక్తి, ఫీలింగ్‌ కనబర్చాలిన సవసరం లేదు. కొందరికి మొదటి నుంచి ఫీలింగ్స్‌ చూపించే అలవాటు ఉంటుంది. వాటిని గమనించాలి. అలాంటి వారు తమను ఎలివేట్‌ చేయడానికి చూస్తారు. భాగస్వామిని చులకనగా చూస్తారు.

అబద్ధాలు చెప్పడం..
ఇక మరో చెడు అలవాటు అబద్ధాలు చెప్పడం. ఇది ఎవరికీ నచ్చదు. మీ భాగస్వామి విషయంలో మీతో అబద్ధాలు చెప్పినా లేదా మీకు విషయాలు చెప్పకుండా దాచినా జాగ్రత్త పడాలి. భవిష్యత్‌లో అలాంటి వారు నమ్మకంగా ఉండరు. దీంతో బంధం బలహీనపడుతుంది.

మీగురించి ఆలోచించడం..
కొంతమందికి తమ గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. వారు ఏదైనా విషయంలో తమ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వొద్దు. ఇలాంటి వాళ్లు సెల్ప్‌ డబ్బాకు ప్రాధాన్యం ఇస్తారు. వారికి దూరంగా ఉండడం మంచిది.