TATA Tiago: ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు యువత సైతం కార్ల కొనుగోలుపై మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం టాటా సంస్థ నుంచి రాబోతున్న ఈ కారు పండగనే చెప్పుకోవచ్చు. అంతలా యూత్ ను ఆకర్షించే విధంగా ఈ కారు ప్రత్యేకత ఏంటనేది మనం కూడా తెలుసుకుందాం రండి.
టాటా సంస్థ కొత్త మోడల్ కారును మార్కెట్ లోకి తీసుకురానుంది. టాటా టియాగో పేరుతో వస్తున్న కారు ధర సుమారు రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల లోపు ఉంటుందని అంచనా. 1199 సీసీ ఇంజిన్ ఉండేలా డిజైన్ చేసిన ఈ కారు 72 నుంచి 84 బీ హెచ్ పి పవర్ ఉండేలా కారును రూపొందించారు. అదేవిధంగా ట్రాన్స్ మిషన్ ఆటోమేటిక్ గా తయారు చేసిన కారు టార్క్యు 95 ఎన్ఎంగా ఉంది.
టాటా టియాగో కారు గంటకు 19 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే విధంగా ఇంజిన్ డిజైన్ చేశారు.. ఫ్ల్యూయల్ టాంక్ కెపాసిటీ 60 లీటర్ల వరకు ఉండగా.. పెట్రోల్ మాత్రమే కొట్టించాలి. అలాగే సీఎన్జీ కూడా ఉంటుంది. కారు బాడీ టైప్ హచ్ బ్యాక్ తరహాలో ఉండనుండగా గ్రౌండ్ క్లియరెన్స్ 166 ఎంఎంగా ఉంటుంది.
అంతేకాదు టాటా టియాగో కారు చీకటిలో ప్రయాణించే విధంగా ఎల్ ఈడీ లైట్లను అమర్చారు. ఈ కారు ఆరు ప్రత్యేకమైన రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్లేమ్ రెడ్, టర్నోడో బ్లూ, టోర్నడో బ్లూ డ్యూయల్ టోన్, డేటోన గ్రే కలర్, ఓపల్ వైట్ విత్ డ్యూయల్ టోన్, ఓపల్ వైట్ రంగుల్లో లభిస్తాయి. అలాగే ఈ కారుల ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుందని తెలుస్తోంది.