Girls and boys : చాలా ప్రాంతాల్లో వింత వింత పోకడలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించినా, తెలిసినా కూడా ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపిస్తుంటుంది. వస్తువులను అద్దెకు తీసుకోవడం కామన్. వస్తువులను కొనుగోలు చేయడం కామన్. అమ్మడం, కొనడం వంటివి ఏ ప్రాంతంలో అయినా సరే కామన్ గా చూస్తుంటాము. కొన్ని సార్లు బడ్జెట్ ఎక్కువగా లేకపోతే కొంత సమయం వరకు అద్దెకు కూడా తీసుకుంటారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోయినా వెళ్లిన ప్రతి చోట ఇల్లు కొనుగోలు చేయలేం అని అద్దెకు తీసుకుంటాం. అయితే అమ్మాయిను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. లేదంటే లవ్ చేసి కొన్ని రోజులు రిలేషన్ లో ఉంటారు. కానీ అమ్మాయిలను, అబ్బాయిలను అద్దెకు తీసుకోవడం ఎప్పుడైనా విన్నారా? కానీ కొన్ని దేశాల్లో ఇది కామన్. ఇంతకీ ఎక్కడ అంటే..?
బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు తీసుకోవడం వియత్నాం నుంచి చాలా ప్రజాదరణ పొందిన ట్రెండ్. అక్కడ బాయ్ ఫ్రెండ్ లను అద్దెకు తీసుకుంటారు. వియత్నా మహిళలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి నైపుణ్యం కలిగిన భాగస్వాములను అద్దెకు తీసుకుంటారట. అయినా ఇలా అబ్బాయిలను అద్దెకు తీసుకోవడం భలేగా ఉంది కదా. లవ్ చేయవచ్చు, లేదంటే దోస్తానా చేయవచ్చు? ఈ అద్దెకు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? కానీ అక్కడ కామన్ గా జరుగుతుందట ఈ ట్రెండ్.
స్పెయిన్ లో ఒక వ్యక్తి “వెడ్డింగ్ డిస్ట్రాయర్” ట్రెండ్‌ను ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వివాహాలను విధ్వంసం చేయడానికి వ్యక్తులను నియమించింది ఆ దేశం. ఇదొక వింత పోకడ కదా. ఇలాంటి పోకడలు చాలా దేశాల్లో రకరకాలుగా జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే జపాన్‌లో చట్టబద్ధంగా “గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకోవచ్చు. ఈ విచిత్రమైన ధోరణిలో, మీరు మీ ఒంటరితనాన్ని వదిలించుకోవడానికి భాగస్వామిని అద్దెకు తీసుకోవచ్చు. ఒంటరిగా ఫీల్ అయితే ప్రతి సారి తోడుగా ఎవరు ఉండలేరు. ఇలాంటి వారికి అద్దెకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంకోచించకుండా చట్టబద్దంగానే జరిగే ఈ ప్రక్రియ ద్వారా మీ పక్కన కాసేపు ఒకరు ఉంటారు. జస్ట్ మనీ చెల్లిస్తే చాలు అన్నమాట.
జపాన్ టుడేలోని ఒక నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి రెండు గంటల కనీస అద్దెకు గంటకు 6,000 యెన్‌లకు (రూ. 3,000 కంటే ఎక్కువ) ఒక స్నేహితురాలిని అద్దెకు తీసుకోవచ్చు. అయితే మొదటిసారిగా వెళ్లేవారు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా తమ స్నేహితురాలిని ఎంచుకోవచ్చు. వామ్మో గంటకు మూడు వేల రూపాయలా అని షాక్ అవుతున్నారా? కానీ నిజంగానే ఇంత ఖర్చు చేసి మరీ స్నేహితురాలిని అద్దెకు తీసుకుంటారట. ఇక “ఫ్రీక్ మ్యాచింగ్”, యునైటెడ్ స్టేట్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన మరొక డేటింగ్ ట్రెండ్. ట్రెండ్ అంటే మీ శక్తి, అభిరుచికి సరిపోయే వారితో బయటకు వెళ్లడం అన్నమాట. భారతదేశంలోని ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి, డేటింగ్‌కు వెళ్లాలనుకునే సింగిల్స్ కోసం ఆఫర్‌ను పోస్ట్ చేసింది. ఇందులో గర్ల్‌ఫ్రెండ్‌గా అద్దెకు అందుబాటులో ఉన్నట్లు వీడియోలో ఆమె పేర్కొంది. ఆమె అద్దె తేదీల కోసం రేట్ కార్డ్‌ని షేర్ చేసింది, రూ. 1,500 నుంచి రూ. 10,000 వరకు అద్దె ఉన్నట్టు తెలిపింది.