Home Loan: బ్యాంకుకు వెళ్లకుండా ఆన్ లైన్ లో Home Loanను ఇలా పొందండి.. నిమిషాల్లో డబ్బు జమ..

బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. అయితే ఇందు కోసం ఇంటర్నెట్ బ్యాంకు అకౌంట్ ను కలిగి ఉండాలి. అందుకోసం ముందుగా బ్యాంకులో ఐడీ, పాస్ వర్డ్ తీసుకోవాలి.

Written By: Srinivas, Updated On : January 16, 2024 2:31 pm

Home Loan

Follow us on

Home Loan: నేటి కాలంలో ప్రతీ పనిని సాంకేతికంగానే చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగం అన్నింటికంటే ముందుగా డిజిటల్ గా మారిపోయింది. దీంతో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలన్నా.. మరొకరికి ఇవ్వాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. గంటల కొద్దీ క్యూలో నిల్చుని నగదు వ్యవహారాలు నిర్వహించేవారు. కానీ డిజిటల్ చెల్లింపులు మొదలయ్యాక.. అంతా ఆన్ లైన్ లోనే ట్రాన్జాక్షన్ నిర్వహిస్తున్నారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడమే కాకుండా కొన్ని బ్యాంకుకు సంబంధించిన పనులు కూడా ఇంటర్నెట్ లో చేస్తున్నారు. తాజాగా హోమ్ లోను ను కూడా ఆన్ లైన్ లో తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అదెలాగంటే?

ఇల్లు కట్టుకోవాలనుకునే కొంతమంది Home Loan తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ రుణ మొత్తం బ్యాంకులో జమ అయ్యే వరకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సరైన ధ్రువ పత్రాలు సమర్పించడం నుంచి వెరీఫై చేసి కొన్ని రోజుల తరువాత గానీ లోన్ అమౌంట్ క్రెడిట్ చేయరు. కానీ బ్యాంకుల మధ్య పోటీ పెరగడంతో పాటు డిజిటల్ చెల్లింపులు ఎక్కువ కావడంతో ఆన్ లైన్ లోనే Home Loan తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. అయితే ఇందు కోసం ఇంటర్నెట్ బ్యాంకు అకౌంట్ ను కలిగి ఉండాలి. అందుకోసం ముందుగా బ్యాంకులో ఐడీ, పాస్ వర్డ్ తీసుకోవాలి. ఆ తరువాత హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా కొన్ని వివరాలు అందించాలి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ HDFC ఆన్ లైన్ ద్వారా హోమ్ లోన్ తీసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా నిమిషాల్లో డబ్బు జమ అవుతుంది.

ముందుగా hdfc.com అనే బ్యాంకు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత Home Loan అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇప్పుడు ఈ లోన్ కు సంబంధించిన ఎలాంటి అర్హతలు అడిగారో చూడండి. ఆ తరువాత రుణం అనే ఆప్షన్ ను ఎంచుకొని కావాల్సిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఈ లోన్ ను 8 మంది కలిసి కూడా తీసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత బ్యాంకు అధికారులు వెరిఫై చేసి అర్హత ఉంటే వెంటనే రుణం ను మంజూరు చేస్తారు.

రుణం తీసుకునేవారి ఆదాయాన్ని బట్టి కూడా రుణ పరిమితిని పెరగవచ్చు. ఉద్యోగస్తులైనే వారి జాబ్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్పటి వరకు బ్యాంకుతో ఉన్న వ్యవహారాలు, సంబంధాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు నుంచి గతంలో తీసుకున్న రుణాలు సరైన విధంగా చెల్లించారా? లేదా? అనేది పరిశీలిస్తారు. చివరగా క్రెడిట్ స్కోర్ ఆధారంగా కూడా రుణం చెల్లిస్తారు.