Reliance: రిస్క్ లేకుండా.. భారీ లాభాలు గడించే వ్యాపారాల్లోకి చొచ్చుకు వెళ్తున్న రిలయన్స్.. తాజాగా మరో కీలక అడుగు వేసింది. ఈసారి జర్మనీ సంస్థ “మెట్రో ఏజీ”ని కైవసం చేసుకుంది. మెట్రో ఏజీ “మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా” పేరుతో టోకు వ్యాపారం నిర్వహిస్తోంది.. ఇది 2003 నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్ సేల్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయి.. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న రిటెయిలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపార నమూనా తో భారత దేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. ఇప్పటివరకు మూడు మిలియన్ల కస్టమర్లకు సేవలు అందించింది.. ఒక మిలియన్ రెగ్యులర్ కస్టమర్లతో వ్యాపారాన్ని అంతకంతకు వృద్ధి చేసుకుంటున్నది. 2022 సెప్టెంబరు నెల ముగిసే నాటికి ఏడాది వ్యవధిలో 7,700 కోట్ల విలువైన విక్రయాలు చేపట్టింది.. భారత్ లోకి ప్రవేశించిన తర్వాత మెట్రో కు ఇది మెరుగైన రికార్డు.

డీ మార్ట్ ను కొట్టేయాలని
రిటైల్ మార్కెట్లో ఒకప్పుడు కిషోర్ బియానీ నేత్రుత్వంలోని బిగ్ బజార్ నంబర్ వన్ గా ఉండేది. కానీ తర్వాత అది కాలగర్భంలో కలిసిపోయింది.. ఆ తర్వాత మోర్ వంటివి వెలుగులోకి వచ్చిన కూడా ఒక దశ వరకే పరిమితమయ్యాయి. ఈ సమయంలో డీ మార్ట్ రిటైల్ మార్కెట్లో ఒక సంచలనంగా వెలుగులోకి వచ్చింది.. ఏకంగా లీడర్ అయింది.. దాదాపు 40 శాతం మార్కెట్ వాటాను తన హస్త గతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రిటైల్ మార్కెట్లో ఎటువంటి నష్టాలు ఉండవు. రిస్క్ కూడా చాలా తక్కువ.

రిలయన్స్ దృష్టి
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రిటైల్ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని రిలయన్స్ యోచిస్తోంది..అందులో భాగంగానే జర్మనీ మెట్రోను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ కు ఇప్పటికే రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ మార్ట్, అజియో వంటి చిల్లర వర్తకాలు నిర్వహించే సంస్థలు ఉన్నాయి..ఇన్ని ఉన్నా అవి డీ మార్ట్ ను బీట్ చేయలేకపోతున్నాయి.. క్రమంలో తమ వ్యాపార అభివృద్ధికి మెట్రో సహకరిస్తుందని భావిస్తూ 2,850 కోట్లకు కొనుగోలు చేసింది. అది కూడా పూర్తి నగదు రూపంలో… కొనుగోలు వార్తల నేపథ్యంలో బిఎస్సి సెన్సెక్స్ లో రిలయన్స్ షేర్లు భారీ ధరకు ట్రేడ్ అయ్యాయి.