IPL 2022 Mega Auction: ఐపీఎల్ నిర్వహణకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్ల వేలం కూడా ఓ కొలిక్కి వస్తోంది. ఇదివరకే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను కొనుక్కునేందుకు రెడీ అయిపోయారు. కొందరు జట్లు మారారు. ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారిపోయారు. ఇందులో వందల కొద్ది ఆటగాళ్లున్నారు. వీరి ప్రతిభ ఆధారంగా ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన వారిని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆటగాళ్ల టాలెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రత్యేకతల గురించి ప్రస్తావించుకుందాం.

ఐపీఎల్ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. కానీ వీరందరిలో ఓ నలుగురు మాత్రం ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. దీంతో అందరి కన్ను వీరిపైనే పడుతోంది. వీరిలో ఏం ప్రాముఖ్యతలు ఉన్నాయి? ఇందుకీ వీరు అంత స్పెషల్? వారిలో ఉన్న నైపుణ్యం ఏమిటి? ఆటలో వారు చూపే ప్రావీణ్యం ఏమిటి? విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అందరి కన్ను వీరిపైనే పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ అంటేనే పొట్టి మ్యాచ్ కావడంతో ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకు కూడా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరి గురించి ఏం విషయాలు ప్రముఖంగా ఉన్నాయో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగుళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. దీనికి 590 మంది ఆటగాళ్లు హాజరవుతారు కానీ ఇందులో నలుగురు మాత్రమే అందరి కళ్లలో పడనున్నట్లు తెలుస్తోంది. వారిలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఐపీఎల్ లోనే అందరి కంటే పెద్దవాడు. దీంతో అందరి కన్ను అతడి మీదే పడింది. ప్రస్తుతం అతడి వయసు 43 ఏళ్లు కావడం విశేషం. దీంతో అందరు అతడి కోసమే వెతకనున్నట్లు తెలుస్తోంది. వయసు రీత్యా అనుభవం కలవాడుగా భావించి అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు ముందుకు వస్తారని ఓ అభిప్రాయం ఉంది.

Also Read: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్ స్పందన ఘోరం
అఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఐపీఎల్ లో అతి చిన్నవాడిగా గుర్తింపు పొందాడు. ఇతడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. దీంతో ఫ్రాంచైజీలు ఇతడిని ఎంపిక చేసుకునేందుకు కూడా ముందుంటారని తెలుస్తోంది. చిన్న వయసు వాడైనందున దూకుడుగా ఆడతాడని అతడి వైపు మొగ్గుతారని ఓ వాదన. ఇక మూడోవాడు ఎంతో అనుభవం గడించిన దినేష్ కార్తీక్. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కావడంతో ఇతడికి 213 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉండటంతో ఇతడి కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడతారని తెలుస్తోంది.

Also Read: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ అయ్యాడు?
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు కూడా ఎక్కువ టీ 20 మ్యాచ్ లు ఆడాడు. దీంతో ఇతడి కోసం కూడా ఫ్రాంచైజీలు వెంపర్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 113 టీ 20 మ్యాచ్ లు ఆడిన ఘనత ఇతడిదే. దీంతో ఐపీఎల్ వేలంలో మరో ప్రధాన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఆటగాడిగా చూడొచ్చు. మొత్తానికి ఐపీఎల్ నిర్వహణకు అప్పుడే రంగం సిద్ధమైపోతోంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో నిర్వాహకులు సన్నాహాల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది.