https://oktelugu.com/

Fruits: రాత్రిపూట ఈ పండ్లు తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

కొందరికి తెలియకుండా కొన్ని పండ్లను రాత్రిపూట తింటుంటారు. దీనివల్ల ఆ పండులోని పోషకాలు శరీరానికి అందకపోవడంతో పాటు సమస్యలను తీసుకొస్తుంది. మరి రాత్రిపూట ఏయే పండ్లు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2024 7:07 pm
oranges

oranges

Follow us on

Fruits: పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే సంగతి మనందరికీ తెలుసు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. డైలీ లైఫ్‌లో పండ్లను యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. మార్కెట్లో రకరకాల పండ్లు ఉంటాయి. డైలీ ఏదో ఒక పండును తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు స్కిన్‌ కూడా కాంతివంతంగా మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా యంగ్ లుక్‌ కనిపించేటట్లు చేస్తుంది. అయితే ఈ పండ్లను సరైన సమయంలో తినడం వల్లే శరీరానికి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏ పండును ఏ సమయంలో తినాలో.. అప్పుడు తింటేనే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే కొందరికి తెలియకుండా కొన్ని పండ్లను రాత్రిపూట తింటుంటారు. దీనివల్ల ఆ పండులోని పోషకాలు శరీరానికి అందకపోవడంతో పాటు సమస్యలను తీసుకొస్తుంది. మరి రాత్రిపూట ఏయే పండ్లు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

సాధారణంగా పండ్లు ఏ సమయంలో అయిన తినవచ్చు. కానీ కొన్ని రకాల పండ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత పండ్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతాయి. మారుతున్న జీవనశైలితో పాటు ఇలా తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం వల్ల తొందరగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అయితే పండ్లను భోజనం తర్వాత తినడం వల్ల నిద్రలేమి, మూత్ర సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి పండ్లను రాత్రిపూట తినడం తగ్గించడం మేలు. ఉదయం పూట పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి పూట అరటి పండును తినకపోవడం మంచిది. ఎందుకంటే అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. కానీ జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటితో అరటి పండును రాత్రిపూట తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రిపూట అరటి పండు తినకపోవడం మంచిది.

 

ఆరోగ్యానికి మేలు చేసే ఆరెంజ్ పండ్లను రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అయిన ఖాళీ కడుపుతో, రాత్రి పూట తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దీర్ఘకాలికంగా వేధిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో కాకుండా రోజులో ఎప్పుడైనా ఆరెంజ్ పండ్లను తినవచ్చు. అలాగే పియర్ పండ్లను కూడా రాత్రిపూట అసలు తినకూడదు. ఇందులో ఎక్కువగా చక్కెర ఉంటుంది. దీనిని రాత్రిపూట తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతాయి. కాబట్టి రాత్రిపూట ఈ పండ్లకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. అయితే పండ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు లేదంటే టిఫిన్ తర్వాత తీసుకోవడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు పొందుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.