https://oktelugu.com/

Mahashivratri: మహాశివరాత్రి నుంచి ఈ మూడు రాశులకు రాజయోగం.. పట్టిందల్లా బంగారమే..

మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు శివుడిని కొలవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.

Written By: , Updated On : February 19, 2025 / 06:00 AM IST
Zodiac Signs

Zodiac Signs

Follow us on


Mahashivratri: మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు శివుడిని కొలవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఆ దేవుడికి అభిషేకం నిర్వహించి ఉపవాసం ఉండి జాగారం చేయడం వల్ల అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి ని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఈ సందర్భంగా ఆలయాల్లో మహాశివుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పలుచోట్ల జాగారాలు ఉండనున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు ముస్తాబ్ అవుతున్నాయి.

అయితే మహాశివరాత్రి రోజున శివానుగ్రహం పొందడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ ఈరోజు నుంచి కొన్ని రాశుల వారి దశతిరగనుంది. ఆయా రాశుల్లో కుబేరుడు కోటీశ్వరులను చేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే కొన్ని రాశులపై లక్ష్మీ అనుగ్రహం ఉండడంతో మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. అయితే మహాశివరాత్రి నుంచి ఏ రాశుల వారు అదృష్టవంతులు ఇప్పుడు తెలుసుకుందాం.

మహాశివరాత్రి నుంచి వృషభ రాశి దశతిరగనుంది. ఈ రాశిలో కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తారు. దీంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదు.

సింహ రాశి వారికి మహాశివరాత్రి నుంచి రాజయోగం పట్టనుంది. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో మీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. గతంలో ఉన్న అనారోగ్యాలు మాయమవుతాయి. వీరికి కూడా కుబేర యోగం ఉండడం వల్ల ధనయోగం ఏర్పడుతుంది. ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములతో ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనట్లయితే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 26 నుంచి మంచి రోజులు రానున్నాయి. ఈ రాశి వారు కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం పట్టడం వల్ల వీరు ఏ పని మొదలుపెట్టిన పూర్తి చేసే వరకు వదలరు. వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటు పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.