From Gir to Girolando: ప్రపంచవ్యాప్తంగా కొన్ని భారత ఉత్పత్తులకు అనేక రకాలుగా డిమాండ్ ఉంది. భారతదేశంలో ఆవులను దేవుళ్ళుగా భావిస్తారు. ఇవి నాణ్యమైన పాలు ఇవ్వడంతో వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కొన్ని రకాల జాతుల ఆవులు సాధారణ ఆవుల కంటే ఎక్కువగా పాలు ఇస్తాయి. అయితే ఆవులతో పాటు కొన్ని రకాల ఎద్దులు కూడా సంతాన ఉత్పత్తికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటిలో గిరి జాతి ఎద్దు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రకమైన ఎద్దులు భారతదేశంలో తగ్గిపోతున్నాయి. కానీ బ్రెజిల్ దేశంలో వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. అలా పెంచడానికి కారణం ఏంటి? అసలు బ్రెజిల్ దేశానికి గిరి జాతికి చెందిన ఎద్దు ఎలా వెళ్ళింది?
1960 ప్రాంతంలో గుజరాత్ కు చెందిన మహారాజు కృష్ణ కుమార్ సిన్హా .. ప్రజలకు చెందిన Celso Sid అనే వ్యక్తికి గిరి జాతికి చెందిన కృష్ణ అనే ఎద్దును బహుమతిగా ఇచ్చాడు. గిరి జాతి ఎద్దులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎటువంటి వాతావరణైనా తట్టుకొని నిలబడుతుంది. అందుకే దీనిని బ్రెజిల్ తీసుకెళ్లినా.. అక్కడి వాతావరణాన్ని తట్టుకొని నిలబడింది. అయితే సాధారణంగా గిరి జాతికి చెందిన ఆవులు రోజుకు 11 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. అయితే గిరిజాతికి చెందిన ఈ ఎద్దుతో.. బ్రెజిల్ కి చెందిన Holstein అనే ఆవుతో క్రాస్ బ్రీడ్ చేయించారు. ఇలా వచ్చిన ఉత్పత్తికి Girolando పేరు పెట్టారు. ఈ ఆవు రోజుకు 20 నుంచి 30 లీటర్ల పాలను ఉత్పత్తి చేసింది. ఈ ఆవులకు మంచి దాన ఇస్తూ.. ప్రత్యేకంగా చూసుకోవడం వల్ల 60 నుంచి 70 లీటర్ల వరకు కూడా ఉత్పత్తి చేశాయి. అలా అత్యధికంగా పాల ఉత్పత్తిని చేసి ప్రపంచంలోనే ఐదో స్థానంలో బ్రెజిల్ దేశం నిలిచింది. అయితే ఇలా ఐదో స్థానానికి నిలవడానికి భారతదేశ నికి చెందిన గిరి జాతి ఎద్దు అనే విషయం చాలామందికి తెలియదు.
గిరి జాతికి చెందిన ఎద్దు వల్ల తమ దేశంలో పాల విప్లవం వచ్చిందని భావించిన బ్రెజిల్ దేశం గిరి ఆవు తో ఉన్న ఫోటోలు 2 pens coin పై ముద్రించారు. అంతేకాకుండా భారతదేశం నుంచి గిఫ్టుగా వచ్చిన కృష్ణ అనేది చనిపోయిన తర్వాత దానిని మమ్మీ ఫైడ్ చేసి గ్లాసులో భద్రపరిచారు. 2016 నాటికి భారతదేశంలో గిరి ఆవుల సంఖ్య 3000 నుంచి 5000 ఉంటే.. బ్రెజిల్ లో మాత్రం 50వేల నుంచి లక్ష వరకు ఉన్నాయి. ఇలా గిరి జాతికి చెందిన ఆవు మన దేశంలోనే కాకుండా బ్రెజిల్ దేశంలో సంచలన విప్లవం సృష్టించింది. ఇప్పటికైనా కొన్ని అరుదైన జాతుల ఆవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎన్నో భారీ మూల ప్రాంతాల్లో అనేక రకాల పాల ఉత్పత్తి చేసే ఆవులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని కాపాడుకుంటే నాణ్యమైన పాల ఉత్పత్తి చేయవచ్చని కొందరు నిపుణులు తెలుపుతూ ఉంటారు.