Free fire : ఒకప్పుడు చాలా మంది ఔట్ డోర్ గేమ్స్ ఆడేవారు. ఈ గేమ్స్ వల్ల శారీరక శ్రమ ఉండేది. దీని వల్ల శరీర పటుత్వం కూడా స్ట్రాంగ్ అయ్యేది. పిల్లల నుంచి పెద్దల వరకు ఉల్లాసంగా ఉండేవారు. కానీ ఫోన్ లు వచ్చిన దగ్గర నుంచి ఆన్ లైన్ లోనే గేమ్స్ ఆడటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఔట్ డోర్ గేమ్స్ ఆఫ్ చేశారు చాలా మంది. ఈ ఆన్ లైన్ గేమ్స్ తో ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొందరు ఏకంగా ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆన్ లైన్ గేమ్స్ చాలా డేంజర్ గా ఉంటున్నాయి. ఇలాంటి గేమ్స్ ఆడుతూ పిల్లలు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడ లేదు. ముఖ్యంగా మన దేశంలో పబ్జీ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రీ ఫైర్ ను ఆడేవారి సంఖ్య పెరిగింది. కానీ ఈ గేమ్ కూడా ఇండియాలో బ్యాన్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ ఫైర్ గేమ్ అభిమానులకు ఓ శుభవార్త చెబుతుంది సంస్థ. ఇంతకీ ఏంటంటే?
ఫ్రీ ఫైర్ అభిమానుల దీని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదా. ఈ గేమ్ కు చాలా మంది అడెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కాస్త సమయం దొరికితే చాలు మళ్లీ సమయం తెలియకుండా అందులో పడి ఆడుతూనే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ గేమ్ ను లైక్ చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ గేమ్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇక మీ సుదీర్ఘ నిరీక్షణ వచ్చే ఏడాది ముగుస్తుంది కావచ్చు అంటున్నారు నిపుణులు.
గారెనా ప్రసిద్ధ యుద్ధ రాయల్ గేమ్, ఫ్రీ ఫైర్, IT చట్టం 69Aని ఉల్లంఘించినందుకు 2022లో నిషేధించారు. కానీ ఇప్పుడు మళ్లీ భారతదేశంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. నిషేధం తర్వాత, గేమ్ Google Play Store, Apple App Store రెండింటి నుంచి తీసివేశారు. దీన్ని నిషేధించేటప్పుడు ఫ్రీ ఫైర్ భారతదేశంలో 10 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉండేది. మొదట్లో గేమ్‌ను గత సంవత్సరం, 2023లో తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేసింది, అయితే లాంచ్ వాయిదా పడింది. అప్పటి నుంచి, అభిమానులు కూడా దీన్ని తిరిగి ఎప్పుడు లాంచ్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు కూడా.
టీజర్ 2023లో వచ్చింది
ఆగస్ట్ 2023లో, ఫ్రీ ఫైర్ ఇండియా అనే కొత్త పేరుతో గేమ్ తిరిగి వస్తున్నట్లు ప్రకటించే టీజర్ విడుదలైంది. ఈ పునఃప్రారంభాన్ని నిజం చేయడానికి, గారెనా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో జతకట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ఉత్తేజకరమైన ట్విస్ట్ ను కూడా యాడ్ చేసింది ఆ సంస్థ. అయితే ఆలస్యానికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ భారతదేశంలో గేమ్‌ను పునఃప్రారంభించేందుకు ఇంకా అవసరమైన సమ్మతి నిబంధనలను పాటించాల్సి ఉందని పరిశ్రమ నిపుణులు సూచించారు.
మొత్తం మీద గేమ్ 2025లో ప్రారంభించబోతున్నారు అని మాత్రం సమాచారం. ఫ్రీ ఫైర్‌ని తిరిగి ప్రవేశపెట్టడం BGMIపై ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ను నిషేధించిన వెంటనే ఈ గేమ్ ను చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. చాలా మంది దీనికి కూడా అడెక్ట్ అయ్యారు. ఇదెలా ఉంటే ఈ గేమ్ కు వినియోగదారులు ఎక్కువగా పెరిగారు. మరి చూడాలి ఫ్రీ ఫైర్ ఎప్పుడు వస్తుందో? దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుందో.