Digestive Health: మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే గ్రీన్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. మన శరీరంలో మనం తిన్నవి బయటకు రాకుండా ఉంటే వాటిని కుళ్లిపోయేటట్టు చేస్తుంది. అందుకే దీన్ని కాపాడుకోవడం మన విధి. మన ఆహార అలవాట్ల వల్ల ఇది డ్యామేజ్ గా మారుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారాలు బయటకు పోకపోతే సమస్యలు వస్తున్నాయి.
అజీర్తి సమస్య ఉన్న వారికి గ్రీన్ బ్యాక్టీరియా బాగా పనిచేస్తుంది. మన కడుపులో రోగనిరోధక శక్తి పెరగాలన్నా దీని మీద ఆధారపడి ఉంటుంది. గ్రీన్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండాలంటే మనతోనే సాధ్యం. గ్రీన్ బ్యాక్టీరియా ఎంత పెంచుకుంటే అంత రక్షణ మనకు ఏర్పడుతుంది. గ్రీన్ బ్యాక్టీరియా మనం పుట్టినప్పుడే మనతో పాటే పుడుతుంది.
గ్రీన్ బ్యాక్టీరియా మనం తినే ఆహారాలను జీర్ణం అయ్యేలా చేస్తుంది. మనం తినే ఆహారం ద్వారా కానీ తాగే నీళ్ల ద్వారా కానీ వాతావరణం కలుషితమైనప్పుడు కానీ ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళితే అది మనకు నష్టం కలిగిస్తుంది. ఒకవేళ గ్రీన్ బ్యాక్టీరియా మీద ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పైచేయి సాధిస్తే మన రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. ఫలితంగా మనకు రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
చెడు బ్యాక్టీరియా మన ఆర్గానిక్స్ ను దెబ్బతీస్తే కష్టమే. గ్రీన్ బ్యాక్టీరియా లోపల ఉండే వాటిని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే మన గ్రీన్ బ్యాక్టీరియా బాగా పనిచేసేందుకు మనం మంచి ఆహారాలను తీసుకుంటేనే మంచిది. లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతిని మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. మనకు గ్రీన్ బ్యాక్టీరియా ఎంతో ముఖ్యమని తెలుసుకోవాలి.
గ్రీన్ బ్యాక్టీరియా బాగుండాలంటే పుల్లటి పెరుగు, మజ్జిగ గానీ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా పెరిగి చెడు బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. సులభమైన చిట్కా ఇదే. దీంతో రోజు పెరుగు, మజ్జిగ వాడుకోవడం ఎంతో ఉత్తమం.