Car driving safety tips: ఒకప్పుడు బైక్ నడిపిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతం కారులోనే ప్రయాణిస్తున్నారు. కారుకు సమానంగా బైక్ ధరలు ఉండడంతో ఫోర్ వీలర్ కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సమయంలో బైక్ కంటే కారు నడిపే సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బైక్ నడపడానికి డ్రైవింగ్ శిక్షణ తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఫోర్ వీలర్ నడపడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నా కూడా డ్రైవింగ్ నిబంధనలు పాటించడం లేదు. ముఖ్యంగా కారుకు ఉండే అద్దం విషయంలో వీరికి రూల్స్ అవగాహన రావడం లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి కారుకు మూడు రకాల అద్దాలు ఉంటాయి. ఇందులో ఒకటి లెఫ్ట్, సైడ్ మిర్రర్ తో పాటు రివర్ వ్యూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే కార్లలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అయితే చాలామంది కారు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనుక వచ్చే వాహనం గురించి తెలుసుకోవడానికి బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. వెనుక వచ్చే వాహనం గురించి వెనుక వైపు తిరిగి చూడకుండా మిర్రర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ మిర్రర్ సరిగా ఉందా లేదా అనేది సరి చూసుకోవాలి.
దాదాపుగా వెనకనుంచి వచ్చే వాహనాలను మిర్రర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది ఇప్పటికి వెనుక వైపు తిరిగి వాహనాల గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా కారుకు ఉండే అద్దాలను సరైన క్రమంలో ఉంచకపోవడం వల్ల వెనుక వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎడమ లేదా కుడి మిర్రర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు.. వీటిలో మాత్రమే వెనుక వచ్చే వాహనాలను గమనించాలి. ఒకవేళ ఈ అద్దాలకు ఏమైనా అడ్డుగా ఉంటే వాటిని సరిచేసుకోవాలి. ఓవర్ టైప్ చేసేటప్పుడు ముందుగా సైడ్ మిర్రర్ చూసి ఆ తర్వాత సిగ్నల్ ఇవ్వాలి. సరిగా చేయకపోతే బ్లైండ్ స్పాట్ ఏర్పడి ప్రమాదం జరుగుతుంది. కారులో ఉండే రివర్ మిర్రర్ కూడా చాలా ప్రాధాన్యంగా నిలుస్తుంది. కారుకు బ్రేక్ వేసే ముందు.. లైన్ మారే ముందు ముందుగా ఈ అందంలో చూసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి. నైట్ మోడ్ ఆప్షన్ ఉంటే వాహనాలకు సంబంధించిన లైట్స్ క్లియర్గా కనిపించేలా సెట్ చేసుకోవాలి.
ప్రస్తుతం ఫోర్ వీలర్ వాహనాలు లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటికి అమర్చే అద్దాలు సెన్సార్ తో పనిచేస్తున్నాయి. వెనకనుంచి వచ్చే వాహనాన్ని ముందే గుర్తించి రెడ్ సిగ్నల్ ఇస్తుంటాయి. అయినా కూడా వాహనాలకు ఏర్పాటు చేసుకున్న అద్దం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అద్దంలో చివరి భాగం కనిపించేలా సెట్ చేసుకోవాలి. అద్దం సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.