Vasthu Tips : సుఖమైన నిద్ర పోవడం లేదా..? మనసు ప్రశాంతంగా ఉండడం లేదా? ఈ 5 సూత్రాలు పాటించండి.

హిందూ పురాణాల ప్రకారం ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన గాలి, వెంటిలేషన్ ఉండడం వల్ల ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో..

Written By: Srinivas, Updated On : September 29, 2024 11:25 am

Vasthu Tips

Follow us on

Vasthu Tips :  ప్రతీ వ్యక్తి తన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సంతోషం అంటే పనులు చేయడం.. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండడం. ప్రస్తుత కాలంలో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. డబ్బు, ఇతర కారణాలతో ఒత్తిడితో కూడుకొని ఏదో ఒక వ్యాధిన బారిన పడుతున్నారు. అయితే ఎటువంటి అనారోగ్యమైనా అందుకు కారణం నిద్రలేమినే అవుతోంది. ఇప్పుడున పరిస్థితుల్లో విద్యార్థులు నుంచి బడా వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో ఉంటున్నారు. దీంతో మంచి నిద్రకు దూరమవుతున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం మాత్రమే కాదు.. మంచి నిద్ర ఉండాలి. వైద్యుల సూచనల ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు.. 4 నుంచి 11 నెలల శిశువులు 15 గంటలు.. 3 నుంచి 5 సంవత్సరాల లోపు వారు 13 గంటలు.. 6 నుంచి 12 ఏళ్ల లోపు వారు 12 గంటలు.. 18 నుంచి 60 ఏళ్ల వయసు వారు 7 నుంచి 9 గంటలు.. 60 ఏళ్ల పైబడిన వారు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలా అయితేనే ఆరోగ్యంగా ఉంటారు.

ఆఫీసు విధులు, వ్యాపారంలో ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా చాలా మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. దీంతో 8 గంటలు నిద్రపోతున్నా.. అది కలత నిద్రగానే ఉంటుంది. అయితే సరైన నిద్ర కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారంగా ఉంచితే మంచి నిద్ర ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో బెడ్ రూం ఏ దిశలో ఉంచితే ఎలాంటి నిద్ర ఉంటుందో కూడా వివరిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు క్రమ పద్ధతిలో పడుకుంటేనే సుఖ నిద్ర ఉంటుంది. అందుకోసం 5 సూత్రాలు పాటించాలి. అవేంటంటే?

హిందూ పురాణాల ప్రకారం ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన గాలి, వెంటిలేషన్ ఉండడం వల్ల ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో..

1. నైరుతిలో బెడ్ రూం ఉండాలి:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి వైపు బెడ్ రూం ఉండేలా చూసుకోవాలి. ఇలా ఏర్పాటు చేయడం వల్ల కుటుంబ యజమాని ఆరోగ్యగంగా ఉండగలుగుతాడు. అలాగేని దక్షిణ నైరుతిలో కాకుండా చూసుకోవాలి. దక్షిణ నైరుతిని స్టోర్ కోసం వాడుతారు. అందువల్ల పూర్తిగా దక్షణం వైపు కాకుండా నైరుతి కలిసి వచ్చేలా బెడ్ రూం నిర్మించాలి. ఇక్కడ బెడ్ రూం ఉండడం వల్ల నిత్యం ప్రశాంతమైన గాలి ఇంట్లోకి వస్తుంది. దీంతో చక్కటి నిద్ర వస్తుంది. అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు.

2. పిల్లల బెడ్ రూంలో పశ్చిమంలో ఉండాలి:
నేటి కాలంలో పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్ రూంలు నిర్మిస్తున్నారు. వారి ప్రైవసీకి స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇలా నిర్మించుకోవాలనుకునేవారు వీరి బెడ్ రూంలను పశ్చిమంలో ఉంచాలి. పిల్లలు చదువుతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో ఇంట్లో పశ్చిమంలో వీరు నిద్రించడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ నిద్రించడం వల్ల వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే పశ్చిమ వాయువ్య దిశలో అస్సలు నిద్రంచకూడదు. ఇలా చేయడం వల్ల ఎప్పుడు నిరాశతో ఉంటారు.

3.వృద్ధులు ఎక్కడ నిద్రించాలి?
జీవితాంతం కష్టపడి అలసిపోయిన వారు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఈ సమయంలో వారు మంచి నిద్రను కూడా ఆశిస్తారు. అయితే వారి కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించాలనుకుంటే వారికి ఎక్కువగా సూర్య కాంతి పడేలా బెుడ్ రూం ఉంచడం మంచింది. అంటే తూర్పు వైపు నిర్మించాలి. తూర్పు వైపు పడక గది ఉండడం వల్ల ఒంటిరితనం లేకుండా ఫీలవుతారు. అంతేకాకుండా వారిలో ఎక్కడా లేని ఉత్సాహ వస్తుంది.

4. ఇంటికి అతిథులు వస్తే..
ప్రతి ఇంట్లోకి అతిథులు రావడం సహజం. ఇలాంటి వారు వచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తాం. అయితే వారి కోసం దక్షిణాన రూం ను నిర్మించడం శ్రేయస్కరం. అతిథులు వచ్చి వెళ్లిపోయేవారు కనుక వారు దక్షిణాన నిద్రించడం వల్ల వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక సెలబ్రేటీల కోసం గదులు నిర్మించాలన్నా ఇక్కడే నిర్మించుకోవాలి.

5. ఇక్కడ అస్సలు నిద్రించొద్దు..
ఇంటికి ఉత్తరం వైపు అస్సలు నిద్రించొద్దు. అలాగే తూర్పు ఈశాన్యంలో నిద్రించడం వల్ల దేవుళ్లు ఆగ్రహిస్తారట. అంతకాకుండా ఇటువైపు తల పెట్టి నిద్రించడం వల్ల పీడకలలు వస్తుంటాయట. అందువల్ల ఈ దిశలో అస్సలు నిద్రించకుండా ఉండాలి.