Focus Suspence Thriller: సినీ పరిశ్రమలో విభిన్న కథలతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అన్ని జోనర్ వాళ్లను కవర్ చేస్తూ కొన్ని సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి. అయితే కొన్ని సినిమాలు అలాంటి వాటికి భిన్నంగా తీస్తూ మంచి హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అరుంధతి సినిమాలాంటివి కూడా ఉన్నాయి.
అందులో కూడా సస్పెన్స్ ను తలపించే ఎన్నో సీన్లు ఉన్నాయి. అయినా ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇలా అన్ని జోనర్ వాళ్లకు నచ్చే విధంగా రిలాక్స్ మూవీ మేకర్స్ ‘ఫోకస్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది స్కైరా క్రియేషన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫోకస్ అనే టైటిల్ తోనే ఆడియన్స్ ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పడిందని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఎక్కువగా సస్పెన్స్ ను ఇష్టపడే వాళ్లు దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారన్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్నాడు. అతడు ఏ కథను ఎంచుకున్నా విభిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకుల మెప్పును పొందుతాడు. అలాంటిది మరో విలక్షణమైన కథను ఎంచుకొని మరోసారి మన ముందుకు రానున్నాడు విజయ్ శంకర్. ఈ సినిమాతో సూర్యతేజ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది.. డైరెక్టర్..
దీనితో మహానటి సుహాసిని మణిరత్నం జడ్జిగా నటిస్తోంది. హీరో విజయ్ దీనిలో పోలీస్ ఆఫీసర్ గా కనపడనున్నాడు. మర్డర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది అంటూ చెప్పుకొచ్చారు మూవీ మేకర్స్. ఎన్నో మలుపులు.. సస్పెన్స్ లు.. ఆసక్తికరంగా సాగే ఈ కథ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అషూరెడ్డి నటిస్తోంది. ఇంత వరకు ఇలాంటి కథ చూడలేదని.. డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించాలని చిత్ర దర్శకుడు సూర్యతేజ కోరాడు. ఈ చిత్రానికి పని చేసే నటీనటులు విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ తదితరులు ఉన్నారు. పీఆర్ఓగా సిద్దు, ఎడిటర్ గా సత్య.జీ పనిచేస్తుండగా.. డీఓపీగా జే. ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ చిత్రానికి స్వరాలను వినోద్ యజమాన్య అందిస్తున్నాడు.