FIFA World Cup History: ఫుట్ బాల్.. పేరుకు నాలుగు అక్షరాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ నాలుగు అక్షరాలే ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. 32 జట్లు హోరాహోరీగా పాల్గొంటున్న సాకర్ కప్ అందరిలోనూ అమితాసక్తిని కలగజేస్తోంది. నిజంగా ఈ క్రీడలో ఏం మ్యాజిక్ ఉంది? ప్రపంచాన్ని ఎందుకు తన వైపు చూసేలా చేసుకుంటున్నది. ఖతార్ లాంటి దేశం ఎందుకు వేల కోట్లు పెట్టి స్టేడియాలు నిర్మించింది? ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న ఫ్రాన్స్, అర్జెంటీనా లార్జెర్ దెన్ లైఫ్ అనే తీరుగా ఎందుకు తలపడబోతున్నాయి? రండి తెలుసుకుందాం.

1930 లో ప్రారంభం
ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ 1930లో ప్రారంభమైంది.. ప్రతి నాలుగేళ్లకు ఓసారి ఫిఫా సూచించిన దేశంలో ఈ టోర్నీ నిర్వహిస్తారు..1942, 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఈ టోర్నీ నిర్వహించలేదు.. 1982 నుంచి ఈ టోర్నమెంట్లో 24 దేశాలు పాల్గొంటున్నాయి 1998 లో సంఖ్య 32 కు చేరుకుంది. రాబోయే కాలంలో దీనిని 40 కి పెంచాలని యోచన ఉంది.. ప్రస్తుతం సాకర్ పోటీలు ఖతార్ దేశంలో జరుగుతున్నాయి. ఫిఫా కప్ 368 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో 6.175 కిలోల బరువు ఉంటుంది. ప్రస్తుత కప్ బేస్ మీద 1974 నుంచి ఈ కప్ గెలుచుకున్న దేశాల పేర్లు రాసి ఉన్నాయి. 1930 నుంచి 1970 వరకు ప్రపంచకప్ ను “జూల్స్ రిమెట్ కప్” పిలిచేవారు..జూల్స్ రిమెట్ 1930 లో ఫిఫా అధ్యక్షుడు. అతడు ఉన్నప్పుడే ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆయన గౌరవార్థం ఆ ట్రోఫీకి ఆయన పేరు పెట్టారు. ఈ కప్ ను ఫ్రెంచ్ శిల్పి “ఏబెలా ప్లయిర్” రూపొందించాడు.1970 లో బ్రెజిల్ ప్రపంచ కప్ ను మూడోసారి గెలవడంతో ఆ జట్టుకు కప్ ను శాశ్వతంగా బహుకరించారు.. కానీ 1983లో ఆ దేశ రాజధానిలో ఉన్న ఈ కప్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.. ఆ తర్వాత దాని జాడ కనిపించలేదు. అంతకుముందు 1966 లో కూడా ఇంగ్లాండులో దీనిని ప్రదర్శించినప్పుడు ఎత్తుకెళ్లారు. పికెల్స్ అనే కుక్క సాయంతో పోలీసులు దానిని తిరిగి తేగలిగారు. 1974 నుంచి ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను ఫిఫా ప్రపంచ కప్ అని పిలుస్తున్నారు.. దీనిని ఇటలీకి చెందిన శిల్పి “సెల్వియో గాజాని” రూపొందించాడు. ఛాంపియన్ జట్టుకు ఒరిజినల్ కప్ కాకుండా దాన్ని ప్రతిరూపాన్ని ఇస్తారు.
దేశాల అర్హత ఆధారంగా
ఫిఫా ప్రపంచ కప్ లో పాల్గొనే దేశాల అర్హత ఆధారంగా ఈ ప్రపంచాన్ని ఆరు భాగాలుగా విధించింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర మధ్య అమెరికాలు, ఓషియానియా, దక్షిణ అమెరికా. ఇందులో ఆసియా విభాగం లో ఆస్ట్రేలియా కూడా ఉంది. ఓషియానియా విభాగంలో న్యూజిలాండ్, తాహతి, సమోవా లాంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. ఈ ప్రపంచ కప్ లో అర్హత సాధించేందుకు 200కు పైగా దేశాలు పోటీపడ్డాయి.. వివిధ టోర్నీలో సాధించిన గెలుపు ద్వారా 31 దేశాలు+ ఆతిధ్య దేశం నిర్వహించే ప్రపంచ కప్ లో పాల్గొన్నాయి

ఇవీ విశేషాలు
ప్రపంచ కప్ చరిత్రలో బ్రెజిల్ ఆటగాడు రోనాల్డో 15 గోల్స్ సాధించాడు. 1998, 2002, 2006లో అతడు ఈ ఘనత సాధించాడు.. జర్మన్ ఆటగాడు మిరోస్లావ్ ఘనా తో జరిగిన ఒక మ్యాచ్లో గోల్ చేయడం ద్వారా 15 గోల్స్ సాధించిన రెండో ఆటగాడు అయ్యాడు. అర్జెంటీనా ఆటగాడు మెస్సీ, జర్మనీ ఆటగాడు థామస్ మిల్లర్, బ్రెజిల్ ఆటగాడు నెయిమార్ ను ఫుట్ బాల్ ఆటకు త్రిమూర్తులు అని పిలుస్తారు.. వీరు ముగ్గురు ఫుట్ బాల్ పోటీల్లో నాలుగు చొప్పున గోల్స్ సాధించారు.. కొలంబియా ఆటగాడు జేమ్స్ ఐదు గోల్స్ చేసి అందరికంటే ముందు వరసలో ఉన్నాడు. ఇక ఈ పోటీల్లో ఫిఫా ఉత్తమ అటగాడికి బంగారు బంతి అవార్డు ఇస్తుంది.. అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి బంగారు బూట్ అవార్డు ఇస్తుంది.. అత్యుత్తమ గోల్ కీపర్ కు గోల్డెన్ గ్లవ్ ఇస్తుంది. అదే కాదు పోటీల్లో ఆడే ఆటగాడు జనవరి 1, 1993 ముందు జన్మించి ఉండకూడదు. ఇక క్రమశిక్షణతో కూడిన ఆట ఆడిన జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు ఇస్తారు. అయితే ఈసారి ఖతార్ లో సాకర్ పోరు జరుగుతున్నది. ఫ్రాన్స్, అర్జెంటీనా ఫైనల్ వెళ్లాయి. ఆదివారం కప్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది.