February 2026: సోషల్ మీడియాలో ఇటీవల కొన్ని విషయాలను నమ్మాలా? నమ్మొద్దా? అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలను కొందరు ఉన్నది ఉన్నట్టు చెబితే.. మరికొందరు మాత్రం సృష్టించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి నెల గురించి ఓ ప్రచారం ఆసక్తిగా మారింది. 2026 ఫిబ్రవరి నెల అరుదైన నెలగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది మళ్లీ 823 సంవత్సరాలకు వస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి నెల ఒక్కోసారి అరుదైన నెలగా వస్తుంది. ఎందుకంటే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీపు సంవత్సరంగా ఫిబ్రవరి నెల ఉంటుంది. కానీ 2026లో ఫిబ్రవరి లీప్ సంవత్సరం కూడా కాదు. మరి అలాంటప్పుడు ఇది అరుదైన నెల ఎలా అవుతుంది? కానీ ఈ నెలలో మాత్రం ఈ విశేషం ఉంది. అదేంటంటే?
సంవత్సరం పొడవునా వచ్చే నెలలో కొన్ని అరుదుగా కనిపిస్తాయి. అందులో ఫిబ్రవరి నెల ఒక్కోసారి విభిన్నంగా ఉంటుంది. 2026 ఫిబ్రవరి నెల అరుదైనది కాకపోయినా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ప్రతి వారం సరిగా నాలుగు సార్లు మాత్రమే కనిపిస్తుంది అంటే ఆదివారం నుంచి శనివారం వరకు క్యాలెండర్లో సరి సమానంగా ఉంటాయి. ఇలా నాలుగు వారాలపాటు ఎలాంటి గ్యాప్ లేకుండా సమానంగా ఉండడంతో ఈనెల చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది.
అయితే ఇలాంటి నెల ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే 2015లో కూడా ఇలాంటి నెల వచ్చింది. మళ్లీ 2037 లో కూడా ఇలాంటి నెల రాబోతుంది. కానీ కొందరు 823 సంవత్సరాల తర్వాత వస్తుందని అంటున్నారు. క్యాలెండర్ సైకిల్ ప్రకారం కొన్ని నెలలు ఇలా వస్తూ ఉంటాయి. ఈ సాధారణంగా పునరావృతమయ్యే వ్యవస్థ. అయితే సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి నెల అరుదైనదిగా పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఫిబ్రవరి నెల ఎప్పుడు 28 రోజులే ఉంటుంది. కానీ కొందరు 2026 ఫిబ్రవరి నెల చాలా అరుదైనదిగా.. తిరిగి 800 ఏళ్ల తర్వాత వస్తుందని అనడంలో ఏమాత్రం నిజం లేదు అని అంటున్నారు.
సాధారణంగా ప్రతి నెలలో 30 నుంచి 31 రోజులు వరకు ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. కేవలం లీపు సంవత్సరంలో మాత్రమే 29వ రోజు వస్తుంది. మిగతా ఎప్పుడు ఇలాంటి రోజు రాకుండా ఉంటుంది. అయితే వీటి విషయాలను నమ్మి అబద్ధపు ప్రచారం చేయడం వల్ల చిక్కులో పడాల్సి వస్తుంది. అందువల్ల వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.