MS dhoni: ఐపీఎల్ ఈ సీజన్ లో సీఎస్కే ఆటతీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ధోనీ ఆటగాడిగా కొనసాగుతున్న ఈ టీం చెత్త ప్రదర్శనతో చివరి ప్లేస్ లో ఉంది. పైగా ధోని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదని గవాస్కర్ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ధోనీ చేసిన ఓ ప్రోమో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇందులో రూల్స్ ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఐపీఎల్ మేనేజ్మెంట్ ధోని లీడ్ రోల్ లో ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో ధోనీ బస్ డ్రైవర్ గా యాక్ట్ చేశాడు. అతను రోడ్డుపై బస్సు నడుపుతున్న సమయంలో ఓ టీవీ షో రూమ్ లో ఐపీఎల్ మ్యాచ్ ను చూసి సడేన్ గా బస్సు మధ్యలో ఆపేస్తాడు. కిటికీ డోర్ వద్దకు వచ్చి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉండిపోతాడు. పైగా బస్సులో ఉన్న వారందరినీ కూడా మ్యాచ్ చూడాలంటూ చెబుతాడు.
రోడ్డుపై బస్సు ఆగిపోవడంతో ఆ వెనకాల వస్తున్న వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినా సరే ధోనీ అవేమీ పట్టించుకోకుండా మ్యాచ్ లో మునిగిపోతాడు. ఈ సమయంలో వెనకాల బైక్ పై వచ్చిన కానిస్టేబుల్ బస్సు రోడ్డు మధ్యలో ఎందుకు ఆపావు అంటూ ప్రశ్నిస్తాడు. దానికి ధోనీ స్పందిస్తూ ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది అంటూ చిల్ గా సమాధానం చెప్తాడు. అది విన్న కానిస్టేబుల్ ఓకే రైట్ అంటూ వెళ్ళిపోతాడు.

కాగా దీనిపై కొన్ని కన్జ్యూమర్ ఫోరమ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నడిరోడ్డుపై బస్సు ఎలా ఆపేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఇప్పటికే చాలా ఫిర్యాదులు చేశాయి. వీటిపై తాజాగా ఐపీఎల్ మేనేజ్మెంట్ స్పందించింది. ఈ ప్రోమోను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రోమో ఎక్కడా కనిపించకపోవచ్చు. మొత్తానికి అటు ఐపీఎల్ లో ఆటతో పాటు ఇటు ప్రోమో ద్వారా కూడా ధోనీపై విమర్శలు ఆగట్లేదు.
https://www.youtube.com/watch?v=eHoU_8q_pBc