Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. ఈ మూవీ నుంచి ఏంటి సార్ ఓకే నా.. అంటూ సాగే పంచకట్టు సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట నాని స్టైల్ ఆఫ్ కామెడీ సీన్లతో సాగుతూ కొత్త ఫీల్‌ను కలిగిస్తుంది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను హర్షిత్ గోలీ రాశాడు. ప్రముఖ లెజెండరీ కర్ణాటక గాయని పద్మశ్రీ అరుణ సాయిరాం అలపించారు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ఇవాళ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు సినీ గేయ రచయిత సిరా శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీపై ఓ పద్యం రాస్తూ.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘బాగానే ఉంది.. కానీ, తనను రావణుడితోనే పోల్చితేనే తనకు మరింత సంతృప్తిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.

అయితే, మేకర్స్ ఈరోజు ఈ చిత్రంకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌తో నిండిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని పెంచింది.