
Father Daughter Relationship: ఆడపిల్ల ఇంటికి అదృష్టం అంటారు. ఆడవారు లేని ఇల్లు అశుభ్రతకు నిలయంగా మారుతుంది. పరిశుభ్రతకు మారుపేరే ఆడపిల్లలు. మగవారు తమ పనులు తాము కూడా చేసుకోరు. అందుకే ఆడది లేని ఇల్లు గాడిది అంటుంటారు. సాధారణంగా మగపిల్లలకు అమ్మ అంటే ఇష్టం. ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ. తండ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది ఆడపిల్లలే. అందుకే వారిని తమ ఇష్టమైన సంతానంగా తండ్రులు భావించడం సహజమే. ఆడవారి కోసం తండ్రి అన్ని చేస్తాడు. మగపిల్లలకైతే ఆస్తి ఆడపిల్లలకైతే కట్నం ఇస్తుంటాడు. కానీ మగవారి కంటే ఆడవారికే తండ్రి అంటే అభిమానం ఉంటుంది.
కన్నవారి కోసమే..
తండ్రి పరువును నిలబెట్టేందుకు ఆడపిల్ల తపిస్తుంది. తన కన్నవారికి ఎలాంటి అపవాదు రావద్దని నిత్యం జాగ్రత్తలు తీసుకుంటుంది. బయటకు వెళ్లాలన్నా ఇంట్లో వాళ్లు తోడు రానిదే వెళ్లదు. అలా కుటుంబ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మిగా భావించడం సహజమే. ఈ నేపథ్యంలో తండ్రికి ఎలాంటి కీడు రాకుండా చూసుకునేందుకు తిపిస్తుంది. అందుకే ఆడపిల్ల అంటే తండ్రికి ఇష్టంగా ఉంటుంది. కొడుకు అయితే వాడి సుఖం కోసం వాడే ప్రయత్నిస్తుంటాడు. తన స్వార్థం కోసం పాటుపడతాడు.
ఆస్తిలో..
మగవారు కుటుంబం గురించి పట్టించుకోరు. ఆడపిల్ల ఓ ఇంటికి వెళ్లినా పుట్టింటి మీదే ఎక్కువ ప్రేమ ఉండటం కామనే. ఇక ఆస్తి విషయంలో కూడబెట్టింది అంతా కొడుకుకే ఇస్తున్నారు. కూతరుకు మాత్రం ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారు. ఈ విషయంలో కొందరు కోర్టుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉంటున్నాయి. ఆడపిల్లకు ఆస్తి ఎందుకు ఇవ్వకూడదు. ఆస్తిలో వాటా అడగడంలో తప్పు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆడపిల్లకు ఆస్తి పంచడంలో ఏ ఆక్షేపణలు ఉండకూడదు.

ఆడపిల్లలకే..
ఆడవారికి ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులంటే గౌరవం ఏర్పడుతుంది. కన్నవారి రుణం తీర్చుకునేందుకు ఆడపిల్ల ఆరాటపడుతుంది. కానీ కొడుకు మాత్రం కుటుంబాన్ని పట్టించుకోడు. పెళ్లి అయిందంటే చాలు వేరు కాపురం పెట్టి కన్నవారిని అసహ్యించుకుంటాడు. దీంతో తల్లిదండ్రులకు నరకమే గతి. ఆడపిల్ల పేరులోనే ఉంది. ఆడ ఉంటుందని అంటారు. అందుకే ఆడాళ్లే కుటుంబ సంరక్షణకు తమ వంతు బాధ్యతగా ఉంటారు. దీంతోనే ఆడపిల్లంటే తండ్రులకు ఇష్టంగా ఉంటుంది. వారి కోసం తన సర్వస్వాన్ని పణంగా పెడుతుంటారు.