WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి..

వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో జూకర్ బర్గ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. వాట్సాప్ లో ఇంత కాలం ఎవరికైన ఫోటో పంపాలంటే ఎంత హెచ్ డి ఫొటో అయినా క్వాలిటీ తగ్గేది. పంపించే ముందు దాని సైజు తగ్గి ఫాస్ట్ గా సెండ్ అయ్యేది.

Written By: Srinivas, Updated On : August 18, 2023 4:35 pm

WhatsApp

Follow us on

WhatsApp: ప్రతీ మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో వాట్సాప్ ఓ భాగం అయిపోయింది. విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం వాట్సాప్ కు యూజర్లు గా మారిపోయారు. యూజర్లకు అనుగుణంగా వాట్సాప్ యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా స్క్రీన్ షేర్, మల్టీ డివైజ్ తదితర అవకాశాలు కల్పించింది. అయితే యూజర్లు ఎప్పటి నుంచో ఫోటో క్వాలిటీపై డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హెచ్ డీ ఫొటోస్ పంపించు కునేందుకు అవకాశం కల్పించింది. ఆ వివరాల్లోకి వెళితే.

వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో జూకర్ బర్గ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. వాట్సాప్ లో ఇంత కాలం ఎవరికైన ఫోటో పంపాలంటే ఎంత హెచ్ డి ఫొటో అయినా క్వాలిటీ తగ్గేది. పంపించే ముందు దాని సైజు తగ్గి ఫాస్ట్ గా సెండ్ అయ్యేది. దీంతో కొందరు తమ విధుల్లో భాగంగా ఫొటోలు వాడాలనుకునేవారికి ఇబ్బందిగా ఉండేది. దీంతో చాలా మంది వాట్సాప్ ద్వారా కాకుండా ఈమెయిల్ ద్వారా పంపించుకునేవారు. అయితే తాజాగా వాట్సాప్ లో హెచ్ డీ క్వాలిటీ ఫొటోలు పంపించుకునే వీలు కల్పించింది.

ఇందుకోసం ఏం చేయాలంటే.. ఇప్పుడు మొబైల్ లో ఉన్న వాట్సాప్ ను ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత మీ దగ్గర ఉన్న హెడ్ డీ క్వాలిటీ ఫోటోలు ఇతరులకు పంపించే ముందు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో హెచ్ డీ, స్టాండర్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. కచ్చితంగా హెచ్ డీ ఫొటోలు పంపి చాలనుకునేవారు హెచ్ డీ ఆప్షన్ ను ఎంచుకుంటే సరిపోతుంది. ఇక అత్యవసరంగా పంపాలనుకునేవారు నార్మల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నా కొందరికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యూజర్ల అందరూ వాడుకోవచ్చు అని జూకర్ బర్గ్ తెలిపారు. ఇటీవల స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ అనే ఆప్షన్లు తీసుకొచ్చింది. తాజాగా హెచ్ డీ క్వాలిటీ ఫొటోస్ సెండింగ్ సదుపాయం అందుబాటులోకి తేవడంతో యూజర్స్ ఇంప్రెస్ అవుతున్నారు. ఇక నుంచి హెచ్ డీ ఫొటోస్ ను పంపించుకోవాలంటే పంపించే ముందు కనిపించే ఆప్షన్స్ నె సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.