Excessive Sweating: మన ఆరోగ్యం గురించి మన దేహం చెబుతుంటుంది. మనమే ఎక్కువగా పట్టించుకోం. మనకు కొన్ని సంకేతాలు ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని శరీరం మనకు సూచనలు చేస్తుంటుంది. కానీ మన పనిలో మనం ఉండి వాటిని గురించి పట్టించుకోం. తీరా సమయం మించిపోయాక అయ్యో అంటే ఏం లాభం. మన శరీర వ్యవస్థలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అన్ని సక్రమంగా పనిచేయాలంటే అన్నింటికి సమాన స్థాయిలో మేత అందాలి. లేకుంటే అవి పాడైపోయి మన కథను కూడా ముగిస్తాయి. అందుకే మన శరీరం విషయంలో నిత్యం ఓ కన్ను వేస్తుండాలి. అప్పుడే మనకు ఏం జరుగుతుందనే దానిపై స్పష్టత రావడం ఖాయం.

కొంతమందికి ఊరకే చెమటలు పడుతుంటాయి. మరికొందరికి ఏ చిన్న పని చేసినా చెమటలు విపరీతంగా రావడం తెలిసిందే. ఇంకొందరికి చెమటలే పట్టవు. చెమట పడితేనే ఆరోగ్యం. చెమట పట్టేవారికే ఆరోగ్యం బాగుంటుందని తెలిసినా అధికంగా చెమటలు పట్టడం మాత్రం అనారోగ్య లక్షణమని చెబుతున్నారు. చీటికి మాటికి చెమలు పట్టే వారు ఉంటారు. ఏమంటే అధిక వేడి వల్ల చెమటలు పడుతున్నాయని అంటుంటారు కానీ అది అనారోగ్యానికి కారణమేనట. అందుకే చెమలు ఎక్కువగా పట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.
Also Read: YCP MPs: సగం మందికిపైగా ఎంపీలకు నో చాన్స్.. వైసీపీలో ఏం జరుగుతోంది?
అధిక చెమటలు పడితే శరీరం దుర్వాసన వస్తుంది. ముచ్చెమటలు పట్టడానికి కారణం గుండె కవాటాలు పనిచేయకపోవడమే అని వైద్యులు చెబుతున్నారు. దీంతో పలు రకాల రోగాలు కూడా చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఎముకల సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాలు తలెత్తే సూచనలు కనిపిస్తాయి. అందుకే అధిక చెమటలు పడితే మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అధిక చెమటలు పట్టే బాధితులు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటేనే ప్రయోజనకరం.

చెమటలు ఎక్కువగా పట్టే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లాభం కలుగుతుంది. ఉప్పు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. విటమిన్లు, ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు, వాల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే చెమట పట్టదు. అదే పనిగా చెమట పడుతుంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స చేయించుకుని మందులు వాడితేనే మంచిది. లేదంటే ఏవో రోగాలకు దారి తీసి ప్రాణాపాయం కలిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో చెమటలు పట్టే బాధితులు తస్మాత్ జాగ్రత్త.
చెమటలు పట్టేవారు మంచినీరు ఎక్కువగా తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. నీరు ఎక్కువగా తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. తద్వారా చెమటలు ఎక్కువగా పట్టవు. వైద్యుల సలహాల మేరకు వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోనే మేలు కలుగుతుంది. చెమటలు ఎక్కువగా పట్టేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Commonwealth Games 2022: భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. అదరగొట్టిన జెరెమీ