Gold: ప్రస్తుత కాలంలో చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చని చాలామంది భావిస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే మేకింగ్ ఛార్జీలతో పాటు జీఎస్టీని కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే అమ్మే సమయంలో మాత్రం కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే పొందే అవకాశం అయితే ఉంటుంది. తరుగు, ఇతర కారణాల వల్ల బంగారంను అమ్మే సమయంలో మార్కెట్ రేటును పొందడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ లాంటి వాటిలో బంగారం పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని చెప్పవచ్చు.
అయితే అదే సమయంలో బంగారు ఆభరణాలపై పెట్టుబడులు మాత్రం ఉత్తమం కాదు. బంగారు ఆభరణాలపై ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ లాభాలను పొందడం సాధ్యం కాదు. అవసరాలకు అనుగుణంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. హాల్‌మార్క్‌తో ఉన్న బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే మాత్రమే మంచి ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
బంగారం కొనుగోలు చేసే సమయంలో బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లు తీసుకోని పక్షంలో స్వచ్చత విషయంలో మోసపోయే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన సమయంలో బిల్లుతో కొనుగోలు చేసిన వాటిని జప్తు చేయడం సాధ్యం కాదు.