కాలం మారే కొద్దీ కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో 70 నుంచి 80 సంవత్సరాలు జీవనం సాగించడం కష్టమవుతోంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మాత్రమే ఆరోగ్యకరమైన జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం వంద సంవత్సరాలకు పైగా జీవనం సాగిస్తున్నారు. ఇంగ్లండ్‌లోని డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామ ప్రజలు వంద సంవత్సరాలకు పైగా జీవనం సాగిస్తున్నారు.
డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన మహిళలు ప్రపంచంలోనే ఎక్కువ ఆయుష్షును కలిగి ఉన్నవారు కావడం గమనార్హం. ఈ గ్రామానికి చెందిన మహిళల యొక్క సగటు ఆయుష్షు 95 సంవత్సరాలు. ఈ గ్రామంలో పొగ తాగే అలవాటుకు సంబంధించి నిషేధం అమలులో ఉంది. ఈ గ్రామం యొక్క జనాభా కేవలం 800 కావడం గమనార్హం.
ఈ గ్రామంలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం కూడా ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కారణమని చెప్పవచ్చు. ఈ గ్రామంకు దగ్గరలో సహజ రిజర్వాయర్ ఉండటం వల్ల ఈ రిజర్వాయర్ నుంచి శుద్ధమైన తాగునీటిని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గ్రామంలో తాజాగా ఐరీన్ నోబ్స్ అనే మహిళ 102వ జన్మదిన మహోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
ప్రపంచ దేశాల ప్రజల సగటు ఆయుర్దాయం 73 సంవత్సరాలుగా ఉంది. ప్రపంచ దేశాలలో మహిళల సగటు ఆయుర్దాయం 76 సంవత్సరాలుగా ఉండగా పురుషుల సగటు ఆయుర్దాయం 71 సంవత్సరాలుగా ఉండనుంది. వృద్ధుల జనాభాను పరిశీలిస్తే చైనా, భారత్, అమెరికా, జపాన్, రష్యా టాప్ 5 దేశాల జాబితాలో ఉండనున్నాయి.