Sree Devi Drama Company: బుల్లి తెరలో ఎన్ని షోలు ఉన్నా.. ప్రేక్షకులు వినోదమైన కార్యక్రమాలకే మొగ్గు చూపుతారు. అలా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేసుకుని బోలెడు ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టే టీవీ చానల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్ షో లతో కాలం వెలిబుచ్చుతున్నాయి . అంతే కాకుండా బుల్లితెరకి ఎంటర్టైన్మెంట్ షోల తోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.
ఈటీవీ షోలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా మారింది. ఇందులో బుల్లితెర పై ఒక వెలుగొందుతున్న స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ నటి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి వారం వారం బుల్లితెర,వెండి తెర సెలెబ్రిటీలను పిలిచి సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ పరంగా కూడా ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది శ్రీ దేవి డ్రామా కంపెనీ.
అయితే ప్రతి వారం ఏదొక కాన్సెప్ట్ తీసుకుని ప్రేక్షకులని అలరింప చేస్తారు శ్రీ దేవి డ్రామా కంపెనీ బృందం. అయితే ఈ వారం ఏకంగా జబర్దస్త్ కంటెస్టెంట్ల పిల్లలని రంగంలోకి దింపారు. పంచ్ లు వేస్తూ వాళ్ళ తండ్రులని మించిపోయారు. ముఖ్యంగా ఆటో రాంప్రసాద్ కూతురు కొడుకు, రాఘవ కొడుకు, గెటప్ శ్రీను కొడుకులు స్కిట్లు చేస్తూ పంచులు వేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ విడుదల చేసిన ప్రోమో లో సందడి చేశారు. చిల్డ్రన్స్ డే స్పెషల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కంటెస్టెంట్లు పిల్లలు వచ్చి సందడి చేసినట్లు ప్రోమో లో కనిపిస్తుంది. మరింత వినోదం కొరకు ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.