Omicron Variant: దేశంలో ప్రజెంట్ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ భయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతీ రోజు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రజెంట్ థర్డ్ వేవ్ రన్ అవుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ఇప్పటికే నాలుగు వేలకు పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ మంచిదేనని, దీనితో కరోనాకు ముగింపు దగ్గరకు వచ్చినట్లేనని కొందరు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో చాలా వరకు జనాలను భయపెట్టిన మహమ్మారులన్నిటికీ కూడా ఏదో ఒక ముగింపు అయితే ఉంటుంది. అలానే కొవిడ్ మహమ్మారికి కూడా ముగింపు ఉంటుందట. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తారాస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో చివరకు ఈ కొవిడ్ అనేది ఫ్లూ తరహా దశకు చేరుకుంటుందని కొందరు చెప్తున్నారు. అలా ఒమిక్రాన్ సృష్టిస్తున్న విధ్వంసం వలన జనం అందరిలోనూ యాంటీబాడీలు చేరి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: డెల్టా, ఒమిక్రాన్ కలిసి మరో కొత్త వేరియంట్.. వినాశనం తప్పదా?
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తి బాగా పెరుగుతున్న నేపథ్యంలో అందరు భయపడుతున్నప్పటికీ అలా కేసులు వ్యాపించడం వలన మంచి జరుగుతుందని కొందరు అంటున్నారు. కేసుల అధిక వ్యాప్తి వలన ప్రతీ ఒక్కరిలో యాంటీ బాడీలు పెరిగి కమ్యూనిటీ మొత్తానికి ఇమ్యూనిటీ పవర్ వస్తుందనే అంచనాలు వేస్తున్నారు కొందరు నిపుణులు. అయితే, జనం ప్రస్తుతం మాత్రం కొవిడ్ వేరియంట్ కేసులు నమోదవుతుండటాన్ని చూసి తెగ భయపడిపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా కేసుల నమోదు శాతం, పాజిటివిటీ రేటు పెరుగుతోంది.
ఈ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తిలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వరుసగా కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. జనాలు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం అనేది కంపల్సరీగా చేయాలని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు , వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్?