Emotional Rakhi Story: దేశవ్యాప్తంగా రాఖి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఇందుకు ప్రత్యేకగా సోదరులు తమ చెల్లెళ్లకు విలువైన బహుమతులను అందించారు. కొందరు చెల్లెళ్ళు ప్రతి ఏటా రాఖీని కడుతూ సోదరులపై మమకారాన్ని చూపిస్తున్నారు. కానీ ఓ సోదరీ మాత్రం 40 ఏళ్ల తర్వాత తన అన్నకు రాఖీ కట్టింది. ఇన్నాళ్లపాటు ఆమె రాఖీ కట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే?
Also Read:రాఖీ కూడా కట్టనంత ద్వేషంతో షర్మిల.. జగన్ కేంటి పరిస్థితి?
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన పసుల వసంత శనివారం రాఖీ పండుగ సందర్భంగా తన అన్న బత్తుల రాజం కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భావోద్వేగం ఏర్పడింది. సోదరి వసంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే నలభై ఏళ్ల తర్వాత తన అన్నకు రాఖీ కట్టడం వల్ల ఎంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య కాసేపు ప్రేమాను బంధాలు కొనసాగాయి. పసుల వసంత 40 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఈ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. చివరగా బస్టర్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆమె అనారోగ్య సమస్యల వల్ల ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
సోదరులు, సోదరీమణులు ఎక్కడ ఉన్న రాఖీ పండుగ ద్వారా కలుసుకుంటారు. వివాహం కాకముందు ఎంతో ఆప్యాయత గా కలిసి ఉండే వీరు వివాహాలు జరిగిన తర్వాత ఎవరికి వారు దూరం అవుతారు. అయితే ఏదైనా పండుగ లేదా శుభకార్యాలలో కలుసుకుంటూ ఉంటారు. కానీ రాఖీ పండుగ రోజు మాత్రం వీరి మధ్య అనుబంధాలు వెళ్లి విరుస్తాయి. ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే కేవలం రాఖీ పండుగ రోజు మాత్రమే కాకుండా జీవితాంతం ఇలా ఒకటిగా కలిసి ఉండాలని తమ తల్లిదండ్రులు కోరుతూ ఉంటారు.
Also Read:వస్తానంటే వద్దన్నాడు.. కవిత రాఖీ కట్టించుకోని కేటీఆర్
కానీ చాలా కారణాలవల్ల నేటి కాలంలో అన్నా చెల్లెలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొందరు విదేశాలకు వెళుతూ ఉంటారు. దీంతో వారు కేవలం ఆన్లైన్లోనే విషెస్ చెప్పే పరిస్థితి ఏర్పడింది. మరికొందరు దూర ప్రాంతాల్లో ఉండే తమా సోదరులకు పోస్టుల ద్వారా రాఖీలు పంపిస్తున్నారు. ఇంకొందరు మొబైల్ ద్వారా విషెస్ చెబుతున్నారు. ఇలా రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది.