Elon Musk Twitter: ట్విట్టర్ యూజర్లకు ఆ కంపెనీ యజమాని ఎలెన్ మస్క్ షాక్ ఇచ్చాడు. ట్విట్టర్ ను తాను టేకేవర్ చేసినప్పటి నుంచి ఒక్కో నిబంధన పెడుతూ వస్తున్న మస్క్ తాజాగా మరికొన్ని రూల్స్ పెట్టాడు. గత రెండు రోజులగా ట్విట్టర్ సేవల్లో అంతరాయం కలిగింది. దీంతో ఈ అంరాయానికి కారణమేంటి? అని కొందరు ప్రశ్నించగా ఎలెస్ మస్క్ కొన్ని నిబంధనలు విధించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యూజర్లకు అపరిమితంగా ట్విట్టర్లో పోస్టుులు చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిమితంగా మాత్రమే పోస్టులు చూసే ఛాన్స్ ఉంది. ఆ వివరాలను వెల్లడిస్తూ ఎలెన్ మస్క్ చేసిన ప్రకటనపై మిశ్రమంగా స్పందనలు వస్తున్నాయి.
గత శనివారం రాత్రి ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా పలు దేశాల్లోని ట్విట్టర్ యూజర్లు ఈ యాప్ ను యాక్సెస్ చేయలేకపోయారు. కొందరు తమ సొంత ఖాతాలు ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా ‘కెనాట్ రీట్రైవ్ ట్వీట్స్’ అని మెసేజ్ వచ్చింది. దీంతో రెగ్యులర్ యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే కొందరు ఎలెన్ మస్క్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ అంతరాయానికి కారణమేంటి? అని అడిగారు. దీంతో ఎలెన్ మస్క్ స్వయంగా స్పందించి ఓ ట్వీట్ ను జారీ చేశారు.
ఇందులో ఆయన కొన్ని నిబంధనలు చేర్చి మెసేజ్ రాసుకొచ్చారు. డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ సమస్యలు పరిష్కరించడానికి కొన్ని పరిమితులను తీసుకొచ్చామని తెలిపారు. ఇందులో భాగంగా యూజర్లు ట్విట్టర్ కు బానిసలైపోతారన్న ఉద్దేశంతో కొన్ని నిబంధనలు తీసుకొచ్చామని అన్నారు. ఇప్పటి నుంచి యూజర్లు రోజూ వీక్షించే పోస్టుల సంఖ్యలను పరిమితం చేశారు. ఇందులో భాగంగా మూడు రకాల యూజర్లను విభజించి వారికి పోస్టుల సంఖ్యను వీక్షించే అవకాశం ఇస్తామన్నారు.
వీటిలో మొదటి కేటగిరీలో వెరిఫైడ్ అకౌంట్ యూజర్లకు 6 వేల పోస్టులు, ఆన్ వెరిఫైడ్ అకౌంట్ కు 600 పోస్టులు, కొత్త ఆన్ వెరిఫైడ్ ఖాతాలకు 300 వరకు పోస్టులు మాత్రమే చూసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో వీటి పరిమితి సంఖ్యను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. యూజర్లు ట్విట్టర్ బానిస నుంచి విముక్తి కల్పించడానికి ఈ నిబంధనలు తీసుకొచ్చామని అన్నారు. అయితే ఇవి తాత్కాలికంగా ఉంటాయని అన్నారు.