Twitter CEO: ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బిలియన్ల డాలర్లు పోసీ దీనిని దక్కించుకున్న తరువాత ఎలాన్ మస్క్ నిత్యం వార్తల్లో వినిపిస్తున్నారు. తాజాగా సీఈవో బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ ప్లేసులో ఓ మహిళకు బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఎలన్ మస్క్ ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసిన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మరో 6 వారల్లోగా కొత్త సీఈవో వస్తారని పేర్కొన్నారు. అయితే నూతనంగా బాధ్యతలో చేపట్టే ఆ మహిళ గురించి ఎలాన్ మస్క్ బయటపెట్టలేదు. కానీ కొందరు ఆమె గురించి ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?
ట్విట్టర్ కంపెనీకి కొత్త సీఈవోగా లిండా యాయారినో బాధ్యతలు చేపడుతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం NBCU అడ్వర్టైజింగ్ హెడ్ గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె మయామిలో జరిగిన ‘పాసిబుల్’ పేరుతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మస్క్ తో కలిసి ఒక సెషన్ నిర్వహించింది. ఇది జరిగిన తరువాత పారిస్ ఒలింపిక్స్ 2024 కవరేజి కోసం NBCతో ట్విట్టర్ భాగస్వామ్యంపై ఆమె సోషల్ మీడియాలో పలు ట్వీట్లు చేశారు. దీంతో కొత్త సీఈవోగా ఈమెను ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లిండా యాయారినో ప్రపంచవ్యాప్తంగా 2000 మందితో కూడిన యాకారినో అనే బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కంపెనీ వీక్షకుల సంఖ్య దాదాపు కోటికి పైగా ఉంది. ఇది అనేక బ్రాండ్స్ ను అడ్వర్టైజ్ చేస్తోంది. 2011 నుంచి యాకారినో బృందం అడ్వర్టైజింగ్ విక్రయాల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించిందని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ లో షీ రన్స్ ఇట్ జారీ చేసిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆమె సొంతం చేసుకుంది.
అయితే ఎలాన్ మస్క్ ఈమె పేరు తెలియకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అప్పుడే ఆమె పేరు వెల్లడించడం ద్వారా అనేక రూమర్స్ క్రియేట్ అవుతాయని ఆయన భావిస్తున్నారు. ఇక తాను సీఈవోగా కొనసాగాలా? వద్దా? అని గతంలో పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయనకు ఎక్కువగా వ్యతిరేక ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర చర్చ సాగుతోంది.