Electric cars in sales: పెరిగిన ధరలు తగ్గకపోవడం .. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోవడం.. కారణంగా పెట్రోల్, డీజిల్ కార్లను చాలా మంది దూరం పెడుతున్నారు. ఈ క్రమంలో Electric carలపై మోజు పెంచుకుంటున్నారు. మొదట్లో విద్యుత్ కార్లపై ఎక్కువగా ఆసక్తి ఉండేది కాదు. కానీ చాలా మంది వీటిపై అవగాహన రాడంతో ఈవీల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. 2023 కంటే 2024 లో విద్యుత్ కార్ల కొనుగోలు సంఖ్య పెరిగిపోయింది. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో సేల్స్ పుంజుకున్నట్లు Fedaration Of Automobile Dealers Association(FADA)వెల్లడించింది. అంతేకాకుండా ఈవీల సేల్స్ విషయంలో మూడు కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే..
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ తో పాటు పర్యావరణ హితంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారులు మోజు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటి సేల్స్ పుంజుకుంటున్నాయి. 2024 ఏడాది అక్టోబర్ లో అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు కలిపి 10,609 విక్రయాలు జరుపుకున్నాయి. 2023 ఏడాది అక్టోబర్ లో 10,534 ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 39 శాతం పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎలక్ట్రిక్ కార్లు 5,874 ఉన్నాయి. నెలవారీగా చూస్తే 80.61 శాతం సేల్స్ పెరిగాయి. అయితే విద్యుత్ కార్ల అమ్మకాల్లో మూడు కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీటిలో టాటా కంపెనీతో పాటు ఎంజీ మోటార్స్, మహీంద్రాలు ఉన్నాయి.
TaTa కంపెనీ నుంచి ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. వీటిలో కర్వ్ తో పాటు టియాగో, పంచ్, నెక్సాన్, టిగోర్ మోడళ్లు ఈవీలుగా ఉన్నాయి. 2024 అక్టోబర్ నెలలో TaTa కంపెనీ 6,152 ఈవీలను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 9.90 శాతం పెరుగుదల కనిపిస్తుంది. దేశంలోని కార్ల ఉత్పత్తిలో టాప్ లెవల్లో ఉన్న ఈ కంపెనీ ఈవీల విక్రయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది.
MG Motors నుంచి రిలీజ్ అయినా ఎలక్ట్రిక్ కార్లు సేల్స్ లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నాయి. గత అక్టోబర్ లో ఈ కంపెనీ 2,530 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 944 కార్లను మాత్రమే విక్రయించింది. ఈ ఏడాదిలో 168 శాతం వృద్ధి సాధించింది. ఎంజీ నుంచి జడ్ ఎస్, కామెట్ వంటి కార్లు ఆకర్షిస్తున్నాయి.
మూడోస్థానంలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు నిలిచాయి. ఈ కంపెనీ 907 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్ లో 277 కార్లను మాత్రమే విక్రయించింది. ఎస్ యూవీ వేరియంట్ లో అత్యధిక విక్రయాలు జరుపుకునే మహీంద్రా ఈవీల సేల్స్ లోనూ తన సత్తా చూపేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు చైనాకు చెందిన బీవైడీ ఎలక్ట్రిక్ కార్లు 363 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దీంతో మెల్లగా తన పాగా వేసేందుకు బీవైడీ ప్రయత్నిస్తోంది