https://oktelugu.com/

Vegetables: ఈ కూరగాయలు రాత్రిపూట తినడం అస్సలు మంచిది కాదు

బ్రస్సికా కుటుంబానికి చెందిన ఈ మొక్క అచ్చం కాలీ ఫ్లవర్ లాగే కనిపిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2024 12:59 pm
    Vegetables

    Vegetables

    Follow us on

    Vegetables: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో కూరగాయలతో కూడిన భోజనం శరీరానికి అనేక పోషకాలు అందిస్తుంది. కూరగాయల్లో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు దేహం నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మాంసాహారాల కన్నా వెజిటేబుల్స్ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుందని చాలా సర్వేల్లోనూ తేలింది. అయితే కొన్ని కూరగాయల్లో ఎన్నో ప్రోటీన్లు, మూలకాలు ఉన్నా.. వాటిని రాత్రి సమయంలో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉదయం మాత్రమే తీసుకోవాలని, రాత్రి సమయంలో తీసుకుంటే పోషకాల మాట అటుంచి అనేక అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవారవుతారని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రాత్రిపూట తినకూడని కూరగాయలు ఏవో చూద్దాం..

    బ్రోకలీ: బ్రస్సికా కుటుంబానికి చెందిన ఈ మొక్క అచ్చం కాలీ ఫ్లవర్ లాగే కనిపిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. కొన్నివ్యాధులను దూరం చేయడానికి ఇది ఎంతో ఉపయోగం. కానీ రాత్రి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉన్నవారు దీనిని పగలు మాత్రమే తినాలి.

    బ్రసెల్స్: బ్రసెల్స్ నట్స్ శరీరానికి అదనపు శక్తి ఇస్తాయి. ఈ నట్స్ ను తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఎముకలు ధృఢంగా ఉండడానికి ఇవి ఎంతో ఉపయోగకరం. కానీ వీటిని రాత్రిపూట తీసుకోవడం అంత మంచిది కాదు. వీటిని తినాలనుకుంటే పగలు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి.

    కాలి ఫ్లవర్: కాలీ ఫ్లవర్ ను గోబి పువ్వు అని కూడా పిలుస్తారు. దీనిని కూరగా వండుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వివిధ చర్మవ్యాధులను నివారించడంలో కాలీఫ్లవర్ ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా కాలీ ఫ్లవర్ మంచి ఔషధంలా పనిచేస్తుంది.అయితే కాలీఫ్లవర్ ను కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు రాత్రి పూట తింటే అవస్థలు తప్పవు.

    క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో రైబోప్లేవిన్, పోలేట్, థయామిన్, మెగ్నీషియం పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ల సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందులో ఎమినో యాసిడ్స్ అధికంగా లభిస్తుంది. అయితే దీనిని రాత్రి సమయంలో తినడం వల్ల తొందరగా జీర్ణం అవదు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతారు.

    వీటితో పాటు వెల్లుల్లి రాత్రి పూట ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఇందులో ఉండే పదార్థాలు నిద్ర రాకుండా చేస్తాయి. పచ్చి బఠానీలు తినడం వల్ల అదనంగా ఎనర్జీ వస్తుంది. కానీ రాత్రి సమయంలో వీటిని తీసుకుంటే ఏమాత్రం జీర్ణం కాకుండా అవస్థలు పడుతారు. స్వీట్ పొటాటో సైతం రాత్రిపూట తినడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.