Soaked Almonds Benefits: మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు. మనం తినే ఆహారాల్లో ఉంటోంది. రోజు మనం తీసుకునే ఆహారాలే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో మనం తీసుకునే ఆహారాల్లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మనం తినే ఆహారాల్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఎన్నో రకాలైనవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటిని మనం తీసుకోవడం లేదు. ఫలితంగా జబ్బులకు దగ్గరవుతున్నాం.

మన ఆరోగ్యం మన కంట్రోల్ లో ఉండాలంటే మంచి ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపాలి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యానికి దోహదపడే పదార్థాల్లో బాదం కూడా ఒకటి. ఇందులో ఉండే పోషకాలతో శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరతాయి. బాదంలో న్యూట్రీషియన్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నిషియం, ఒమేగా 3 ఫ్యాట్, ప్రొటీన్లు అధికంగా ఉండటంతో వీటిని తీసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు.
బాదం ప్రతిరోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. నానబెట్టిన బాదంలు తినాలా? వట్టివే తినాలా? అనే దానిపై అందరికి సందేహాలు ఉన్నాయి. బాదంలో కొందరు నానబెట్టినవి తీసుకుంటే మరికొందరు వట్టివే తింటారు. దీంతో ఏవి మంచివి అనే విషయంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. బాదం తొక్కతో తినడం వల్ల టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. నానబెడితే తొక్క ఊడిపోతుంది. దీంతో మనకు పోషకాలు మెండుగా అందుతాయి. అందుకే ఎక్కువ మంది నానబెట్టి తినేందుకు మొగ్గు చూపుతుంటారు.

రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అందుకే బాదంను నానటెట్టి తీసుకోవడమే మేలు. బాదంను రోజు తినడం వల్ల మనకు ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా బాదంలు తీసుకోవడం ఉత్తమం. బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే బి17లో న్యూట్రీషియన్లు క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. అందుకే బాదంను రోజు తీసుకోవడం వల్ల మనకు ఎన్నో విధాలైన ప్రయోజనాలు దక్కుతాయని తెలుసుకుని వాడుకోవడం మంచిదే.